Breaking News

రూల్స్ పాటించమంటే తన్నులే

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. రూల్స్ అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధించాలంటూ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీచేశాయి. అయితే ఈ నిబంధనలు సామాన్య జనాలకే.. మాకు కాదంటున్నారు కొందరు నాయకులు. మమ్మల్ని అడిగితే తన్నులు తప్పవంటున్నారు.

హెల్మెట్‌ లేకుండా బైక్ నడపడమే కాకుండా పరిమితికి మించి ముగ్గురు కూర్చుని వెళుతున్న బీజేపీ నాయకుడి కుటుంబానికి చెందిన యువతులను ప్రశ్నించినందుకు ఓ పోలీసు అధికారిపై చేయి చేసుకున్నారు. అతడిపై పిడిగుద్దులు, తన్నుల వర్షం కురిపించారు. ఏకంగా ఐదుగురు ఒకేసారి మీదపడి చిత్తుగా దాడి చేసి కొట్టారు. ఈ ఘటన  భోపాల్ గునాలోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ దగ్గర జరిగింది.

చూస్తున్నవారంతా తమ మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించేవారే తప్ప ఇదేం అన్యాయం అని ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు. గునాలోని శోభనా రఘువంశి అనే వ్యక్తి అక్కడ బ్లాక్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు ఒకే వాహనంపై హెల్మెట్‌ లేకుండా వెళుతున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించినందుకు వారికి ఫైన్‌ వేశాడు ఓ పోలీసు. ఈ విషయం వారు ఇంటికి ఫోన్‌ చేసి చెప్పడంతో శోభనా భర్త రాజీవ్‌ రఘువంశీ కొంతమందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఆ పోలీసు కాలర్‌ పట్టుకొని కంట్రోల్ రూం నుంచి బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు. అంతే కాదు ఇది మరోసారి రిపీట్ అయితే పరిస్థితిలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ పోలీసులను హెచ్చరించాడు రాజీవ్.

Check Also

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

  పోలీసుల అదుపులో ఇద్దరు కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *