Breaking News

Daily Archives: April 25, 2017

తెరాస సభకు ముమ్మర ఏర్పాట్లు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌లో నిర్వహించనున్న తెరాస ఆవిర్భావ దినోత్సవ సభకు జనసమీకరణ చేసేందుకు ప్రజాప్రతినిధులు, తెరాసశ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బాన్సువాడ, కామారెడ్డిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌లు ట్రాక్టర్లనుసిద్దం చేస్తున్నారు. ఎండ వేడిమి నుంచి రక్షణ పొందేందుకు వెదురుబొంగులు, తడకలతో ట్రాక్టర్లపై ప్రత్యేకంగా పైకప్పులు ఏర్పాటు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోనే వందకు పైగా ట్రాక్టర్లను ఇందుకోసం సిద్దం చేస్తున్నారు. కామారెడ్డిలోనూ ఏర్పాట్లు సాగుతున్నాయి.

Read More »

మైనర్‌లకు కౌన్సిలింగ్‌

  కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లైసెన్సులు లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్‌ యువకులకు మంగళవారం కామారెడ్డి డిఎస్పీ ప్రసన్న అవగాహన కల్పించారు. ఇటీవల పట్టణంలో మైనర్‌లు వాహనాలు నడుపుతుండడంతో పోలీసులు వారిపై దృష్టి సారించారు. మైనర్‌లకు వీటిపై అవగాహన కల్పించారు. మైనర్‌లకు వారి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని, తద్వారా యువకులు ప్రమాదాల బారినపడే ఆస్కారముందన్నారు. లైసెన్సులు లేకుండా ఎట్టిపరిస్థితిలో వాహనాలు నడపవద్దని, నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు. పలు ప్రమాదాలకు సంబంధించిన విషయాలను …

Read More »

గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాను గుడుంబ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపిడివోలు,డిఆర్‌డివో సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రెండున్నర గంటల పాటు వీడియో కాన్పరెన్సులో అధికారులతో మాట్లాడారు. హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధి హామీ పథకం, అంగన్‌వాడి సెంటర్ల పనితీరు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు, సన్నాహాలు, గొర్ల …

Read More »

మలేరియా నివారణ దినోత్సవ ర్యాలీ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంగళవారం ర్యాలీని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మలేరియా నివారణకు ప్రజల్లో ఆరోగ్యశాఖ, బల్దియా అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. మలేరియా నివారణ చర్యలు, చికిత్స, దోమల నివారణ, తదితర వాటిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తు మలేరియా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పట్టణంలోని మురికి వాడలను గుర్తించి …

Read More »

ఎస్‌పి కార్యాలయాన్ని పరిశీలించిన డిఐజి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌పి కార్యాలయాన్ని మంగళవారం డిఐజి శివశంకర్‌రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న డిఐజి పట్టణ శివారులోని ఎస్‌పి కార్యాలయానికి వెళ్ళి కార్యాలయ భవనాన్ని, అక్కడి పరిస్తితులను పరిశీలించారు. డిఎస్‌పి, సిఐ, ఎస్‌ఐలతో మాట్లాడారు. నేరాలు, కేసులు, వాటి పురోగతిపై సిబ్బందితో సమీక్షించారు. అక్కడి నుంచి అడ్లూర్‌ శివారులో నిర్మిస్తున్న భవన సముదాయాలను పరిశీలించారు. ఆయన వెంట డిఎస్‌పి ప్రసన్నకుమారి, పట్టణ సిఐ శ్రీధర్‌ కుమార్‌, …

Read More »