Monthly Archives: May 2017

విద్యావాలంటీర్ల దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2017-18 విద్యాసంవత్సరానికి గాను విద్యావాలంటీర్ల నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ తెలిపారు. ఖాళీల వివరాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారులకు తెలిపామన్నారు. ఖాళీలకు అనుగుణంగా అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా జూన్‌ 1 నుంచి 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.

Read More »

పుట్టిన పది నిమిషాలకే పసికందు మృతి

  – డెలివరి సమయంలో అందుబాటులో లేని వైద్యుడు – కాన్పు చేసిన స్టాఫ్‌నర్సు గాంధారి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవ మాసాలు మోసిన తల్లికి కడుపుకోత మిగిలింది. పుట్టిన పదినిమిషాలకే పసికందు మృతి చెందడంతో బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం విలవిలలాడింది. వేకువ జామున నొప్పులు రావడంతో అంబులెన్సులో ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి డ్యూటీలో ఉన్న స్టాఫ్‌నర్సు కాన్పు చేయడం, డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో పుట్టిన పదినిమిషాలకే పండంటి ఆడపిల్ల అనంతలోకాలకు వెళ్లిపోయింది. వివరాలిలా ఉన్నాయి… గాంధారి …

Read More »

అంటరానితనాన్ని రూపుమాపాలి

  గాంధారి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ది చెందుతున్న సమాజంలో అంటరానితనాన్ని దరిచేరకుండా రూపుమాపాలని గాంధారి తహసీల్దార్‌ ఎస్‌.వి. లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం మండలంలోని బూర్గుల్‌ గ్రామంలో సివిల్‌ రైట్స్‌డే సందర్భంగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికంగా అభివృద్ది చెందుతున్న తరుణంలో ఎక్కడా అంటరాని తనం వుండవద్దన్నారు. దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కొరకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. తద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు ఈ …

Read More »

ఇంటింటికి మోడి పథకాల ప్రచారం

  గాంధారి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో ఇంటింటికి మోడి పథకాల ప్రచార కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రవేశపెట్టిన అభివృద్ది పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ది కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాల ఫలాలు సామాన్య ప్రజలకు అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రబుత్వం అందజేస్తున్న పథకాలన్ని కేంద్ర ప్రభుత్వ …

Read More »

గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని గురుకులాల్లో పొరుగు సేవల ద్వారా నియామకం కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. జంగంపల్లి, పిట్లం, ఎర్రపహాడ్‌, బీర్కూర్‌ పాఠశాలల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్టు 4 పోస్టులను పొరుగుసేవల ద్వారా భర్తీచేయనున్నామన్నారు. 21 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్యగలవారై ఉండాలని, ఈనెల 31 నుంచి జూన్‌ 3లోగా ప్రగతిభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కెసిఆర్‌ కిట్‌ పథకం కోసం డాటా ఎంట్రీ ఆపరేటర్‌ …

Read More »

ఏఎన్‌ఎంపై సస్పెన్షన్‌ వేటు

  కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న రూప నుసస్పెండ్‌ చేస్తు ఉత్తర్వులు జారీచేస్తున్నట్టు కామారెడ్డి వైద్య శాఖాధికారి తెలిపారు. అమ్మఒడి కార్యక్రమం కోసం అర్హులను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసేందుకు వారి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని ప్రజలు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి రూపపై సస్పెన్షన్‌ వేటు విధించామన్నారు. పూర్తి విచారణ తర్వాత తదుపరి చర్యలుంటాయని డిఎం అండ్‌ హెచ్‌వో పేర్కొన్నారు.

Read More »

సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలి

  కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాదాబైనామా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, ఆర్డీవో, తహసీల్దార్లకు సూచించారు. బుధవారం వారితో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు శ్రద్ద వహించి వీలైనంత వరకు సాదా బైనామాలు పరిష్కరించి పట్టాదారు పాసుపుస్తకాలను జారీచేసేలా వీలు కల్పించాలన్నారు. సమాచారాన్ని క్రోడీకరించి ఇవ్వాలని ఆదేశించారు. సంయుక్తకలెక్టర్‌ సత్తయ్య మాట్లాడుతూ సాదా బైనామాలకు సంబంధించి దరఖాస్తులను వివిధ విభాగాలుగా విభజించి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో …

Read More »

కామారెడ్డిలో ఇంటింటికి బిజెపి

  కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీనదయాళ్‌ ఉపాధ్యాయ కార్యవిస్తరణలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని రాజానగర్‌లో బుధవారం ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజానగర్‌లోని 188వ బూత్‌ కేంద్రంలో బిజెపి నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపినీ చేశారు. ఇంటింటికిబిజెపి, వాడవాడకు నరేంద్రమోడి అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్దే దేశాభివృద్ది నినాదంతో ప్రజల్లోకి వెలుతున్నట్టు తెలిపారు. ప్రధాని మోడి చేసిన మంచి పనులను వివరిస్తు కెసిఆర్‌ వైఫల్యాలను సైతం ప్రజల్లోకి తీసుకెళుతున్నట్టు తెలిపారు. …

Read More »

1న జిరాక్సు సెంటర్ల మూసివేత

  కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అన్ని జిరాక్సు సెంటర్లను జూన్‌ 1న స్వచ్చందంగా మూసి ఉంచనున్నట్టు జిరాక్సు సెంటర్ల అసోసియేషన్‌ ప్రతినిదులు తెలిపారు. బుధవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో వారు ఈ మేరకు తీర్మానించారు. గత 25 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా రేట్లు పెంచుతున్నట్టు తెలిపారు. జూన్‌ 2వ తేదీనుంచి దరలు అమలవుతాయని దీనికి ప్రజలందరు సహకరించాలని కోరారు. జిరాక్సు సెంటర్ల యజమానులందరు సైతం బంద్‌లో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు.

Read More »

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా అవగాహన

  ఆర్మూర్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం దేగాం గ్రామంలో ప్రపంచ పొగాకు వ్యతిరేకదినం సందర్భంగా పొగాకు తాగుతున్న వ్యక్తులకు అవగాహన కల్పించడం జరిగిందని ఆరోగ్య పర్యవేక్షులు వై.శంకర్‌ అన్నారు. పొగాకు వలన కలిగే నష్టాలు, సిగరేట్‌ తాగడం వల్ల శ్వాసకోశవ్యాధులు, బ్యాంకైటిస్‌, టిబి, ఊపిరి తిత్తుల క్యాన్సర్‌ వంటి వ్యాధులు వస్తాయని, గుట్కా, పొగాకు నమలడం ద్వారా నోటి క్యాన్సర్‌, గొంతు క్యాన్సర్‌, అన్నవాహిక క్యాన్సర్‌, జీర్ణకోశ క్యాన్సర్‌, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయని తెలిపారు. …

Read More »