Daily Archives: May 1, 2017

దేశంలోనే రెండు అవార్డులందుకున్న ఏకైక ఐఏఎస్‌

  నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకే జిల్లాలో జిల్లాకలెక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ యోగితా రాణా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు అందుకోవడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. గత సంవత్సరం ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో వచ్చినందుకు జాతీయ స్థాయి అవార్డు పొందారు. అదేవిధంగా హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే అత్యధికంగా మొక్కలు నాటినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేతుల మీదుగా 2016 ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ అవార్డు పొందారు. …

Read More »

ప్రధానమంత్రి విశిష్ట ఉత్తమ సేవా అవార్డు రైతులకు అంకితం

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 11వ సివిల్‌ సర్వీస్‌ దినోత్సవం సందర్భంగా ఈనామ్‌ అమలుపై ప్రధాన మంత్రి చేతుల మీదుగా ప్రధానమంత్రి విశిష్ట ఉత్తమ సేవా అవార్డు అందుకోవడంతో మరింత బాధ్యత పెరిగిందని, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేయడం దేవుడిచ్చిన వరమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా అన్నారు. సోమవారం ఉదయం ప్రగతిభవన్‌లో ఈనామ్‌ జాతీయ అవార్డు స్వీకరించిన తర్వాత జిల్లా కలెక్టర్‌ జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా …

Read More »

అలసత్వం వహించిన ఫీల్డ్‌ అసిస్టెంట్ల సస్పెన్షన్‌

  నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి సాధించలేని ఐదుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా డిఆర్‌డిఓ వెంకటేశ్వర్లును ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన చాంబరులో అసిస్టెంట్‌ కలెక్టర్‌, జడ్పి సిఇవో, డిఆర్‌డివో అధికారులతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గత 15 రోజుల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిర్దేశించిన లక్ష్యం మేరకు పురోగతి సాధించని వారిపై క్రమశిక్షణ చర్యలు …

Read More »

డయల్‌ యువర్‌ ఎస్‌పికి నాలుగు ఫిర్యాదులు

  కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఎస్‌పి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్‌పి కార్యక్రమంలో ప్రజల నుంచి నాలుగు ఫిర్యాదులు అందినట్టు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. దేవునిపల్లి – 1, మాచారెడ్డి-1, సదాశివనగర్‌ -1, బిచ్కుంద – 1 పిర్యాదులు అందాయన్నారు. జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని ఉత్తర్వులు జారీచేసినట్టు పేర్కొన్నారు.

Read More »

ప్రజావాణిలో 36 ఫిర్యాదులు

  కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 36 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది తెలిపారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణతోపాటు జేసి సత్తయ్యలు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు రాగా వాటిని కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులకు పంపారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు తెలిపారు.

Read More »

ఫోన్‌ ఇన్‌ విత్‌ కలెక్టర్‌కు ఏడు ఫిర్యాదులు

  కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌విత్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో ప్రజల నుండి ఏడు ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలను ఫోన్‌ ద్వారా కలెక్టర్‌కు తెలియజేశారన్నారు. ఆయా ఫిర్యాదులను సంబంధిత అధికారులకు కలెక్టర్‌ బదిలీ చేసినట్టు తెలిపారు.

Read More »

విద్యుదాఘాతంతో రైతు మృతి

  కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిమండలం లింగాయిపల్లి గ్రామంలో సోమవారం విద్యుదాఘాతంతో రైతు మృతి చెందినట్టు దేవునిపల్లి ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు. లింగాయిపల్లిలో రైతు తోటరాములు (54) పంటకు నీరుపెడుతుండగా ప్రమాదవశాత్తు బోరుమోటారు వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడన్నారు. మృతునికి ఇద్దరు కుమారులున్నారని, ప్రస్తుతం వారు దుబాయ్‌లో ఉన్నట్టు చెప్పారు. మృతుని భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వివరించారు.

Read More »

ఎటిఎం ప్రారంభం

  కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కో ఆపరేటివ్‌ బ్యాంకు ఎటిఎంను సోమవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. నాబార్డు సహకారంతో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్‌ గంగాధర్‌రావు పట్వారి, వైస్‌ ఛైర్మన్‌, సిఇవో అనుపమ, ఏజిఎం భూంరావు, కామారెడ్డి మేనేజర్‌ రంజిత్‌గౌడ్‌, డైరెక్టర్‌ సంపత్‌గౌడ్‌, కిష్టాగౌడ్‌, మునిసిపల్‌ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం

  కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఎస్‌పిఆర్‌ పాఠశాలలో క్రీఢాభారతి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణాశిబిరం సోమవారం ప్రారంభమైంది. సుమారు 60 మంది విద్యార్థులు శిబిరంలో పాల్గొంటున్నట్టు డైరెక్టర్‌ మారుతి తెలిపారు. శిబిరంలో విద్యార్థులకు ఖోఖో, కబడ్డి, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌లో ప్రత్యేక తర్పీదు ఇవ్వనున్నట్టు క్రీడాభారతి నిర్వాహకులు తెలిపారు.

Read More »

ఘనంగా కార్మిక దినోత్సవం

  కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయా కార్మిక సంఘాల ఆద్వర్యంలో ఎర్రజెండా ఎగురవేసి మేడే సంబరాలు జరుపుకున్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మికుల పక్షాన నిలవాలని, కార్మికులకు జీవనభృతి, ఇల్లు, పింఛన్లు, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు పాల్గొన్నారు.

Read More »