Breaking News

Daily Archives: May 2, 2017

శిక్షణా తరగతులకు దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ స్థాయిలో శిక్షణా కార్యక్రమానికి వెళ్ల దలచుకున్న ఉపాద్యాయులు జిల్లా శాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ తెలిపారు. 52 సంవత్సరాల వయసులోపు గల ఉపాధ్యాయులు డిఇఓ కార్యాలయంలో సంప్రదించి ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఢిల్లీ, రాజస్తాన్‌, అస్సాం, హైదరాబాద్‌ కేంద్రాల్లో 10 నుంచి 20 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు. మే 4వ తేదీ నుంచి జూలై 11 వరకు దశల …

Read More »

రైతుకు అండగా నిలబడతాం

  కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం రైతుకు అండగా నిలబడుతుందని, రైతు అభ్యున్నతికి పాటుపడుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డిలో రైతులకు ట్రాక్టర్లు పంపినీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా వ్యవసాయ రంగంలో వివిధ పథకాలను ప్రారంభించారన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు రైతుల పెట్టుబడి కోసం ఎకరాకు రూ. 4 వేలు ముఖ్యమంత్రి ప్రకటించారని పేర్కొన్నారు. దీంతో రైతులు పంటలు …

Read More »

విద్యుత్‌ నష్టపరిహారం చెల్లింపు

  కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుదాఘాతంతో రైతుకు చెందిన ఎద్దు మృతి చెందగా రైతుకు భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్‌ అధికారులతో సంప్రదించి మంగళవారం నష్టపరిహారం చెల్లించారు. మద్దికుంట గ్రామానికి చెందిన కుమ్మరి లింగం ఎద్దు ట్రాన్స్‌ఫార్మర్‌ ఎత్తు తక్కువగా ఉండడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. బిఎంఎస్‌ నాయకులు విద్యుత్‌ శాఖ అధికారులను సంప్రదించారు. ఏడిఇ సతీష్‌ 40 వేల రూపాయల చెక్కును బిఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి లింగమాచారి ఆధ్వర్యంలో రైతు …

Read More »

కామారెడ్డి న్యాయమూర్తుల బదిలీ

  కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కోర్టుకు చెందిన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. సబ్‌ కోర్టు సివిల్‌ జడ్జి ఏ.జయరాజ్‌ మంథని కోర్టుకు బదిలీ కాగా, వారి స్థానంలో కొత్తగూడెం నుంచి సత్తయ్య బదిలీపై వచ్చారు. ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.బి.శీతల్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకూరుకు బదిలీ కాగా వారి స్థానంలో హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు నుంచి ఎం.కిరణ్మయి బదిలీపై వస్తున్నట్టు కోర్టు వర్గాలు తెలిపాయి.

Read More »

గొల్లకుర్మ సభ్యుల పేర్లు నమోదు

  బీర్కూర్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి, నెమ్లి గ్రామాల్లో మంగళవారం గొల్ల కుర్మ సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల అధికారులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మ సభ్యుల కొరకు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని గుర్తిస్తున్నట్టు మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు అర్హులు కావలసిన గొల్లకుర్మలు ఖచ్చితంగా కులంలో సభ్యత్వం చేయించుకోవాలని ఆయన సూచించారు. బొమ్మన్‌దేవుపల్లిలో 118, నెమ్లిలో 109 మంది …

Read More »

37.29 కోట్లతో నిజాంసాగర్‌ కాలువ ఆధునీకరణ పనులు

  నిజాంసాగర్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అప్పుల ఊబి నుండి బయటకు వచ్చి స్వంతంగా పెట్టుబడులు సమకూర్చుకొని తన కాళ్ల మీద తాను నిలబడటానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయరంగానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల పరిధిలో రూ. 37.29 కోట్లతో చేపట్టే నిజాంసాగర్‌ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ పనులకు శంకుస్తాపన చేసిన అనంతరం మంత్రి రైతులనుద్దేశించి ప్రసంగించారు. లక్ష …

Read More »

గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం

  మోర్తాడ్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2017 జూన్‌ లక్ష్యంగా గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ గంగారాం అన్నారు. మంగళవారం మోర్తాడ్‌ ఎక్సైజ్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం గుడుంబ నియంత్రణ గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం కలలుగన్న బంగారు తెలంగాణ, ఆరోగ్య తెలంగాణలో భాగంగా మోర్తాడ్‌ సర్కిల్‌ ఎక్సైజ్‌ సిఐ సహదేవుడు, ఎస్‌ఐ నరేశ్‌, సిబ్బంది రెండేళ్లలోపు గుడుంబా నియంత్రణకు కృషి చేశారని అన్నారు. గుడుంబా స్థావరాలపై …

Read More »

సర్పంచ్‌ చొరవతో పనులు ప్రారంభం

  గాంధారి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని గుండమ్మ కాలువ రోడ్డులో మురికి కాలువ నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు గుండా డ్రైనేజీ నిర్మాణం లేకపోవడంతో మురికి నీరు రోడ్డుపై నిలిచి ఉండేది. చిన్నపాటి చినుకు పడినా రోడ్డు చిత్తడిగా మారి దుర్గంధం వ్యాపించేది. ఇదేరోడ్డు వెంబడి ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్న ప్రజలకు మురికి నీరు నిలువడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. రోడ్డుపై నిలిచిన మురికి నీటిలో దోమలు, పందులు …

Read More »

యువతి ఆత్మహత్య

  మోర్తాడ్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రకాశం జిల్లాకు చెందిన తోట మౌనిక (27) మంగళవారం మోర్తాడ్‌లోని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు మోర్తాడ్‌ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం మౌనిక తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితం ప్రకాశం జిల్లా నుంచి మోర్తాడ్‌కు జీవనోపాది కోసం వచ్చారు. కూల్‌డ్రింక్స్‌ వ్యాపారం చేస్తు జీవనం సాగిస్తున్నారు. కాగా మౌనిక ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. వేసవి సెలవులు కావడంతో ఇటీవల మోర్తాడ్‌లోని తల్లిదండ్రుల వద్దకొచ్చింది. కొంతకాలంగా మౌనికకు …

Read More »

పైప్‌లైన్‌కు మరమ్మతులు ప్రారంభం

  గాంధారి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి గ్రామ పంచాయతీ పరిధిలో పైప్‌లైన్లకు మరమ్మత్తు పనులను మంగళవారం సర్పంచ్‌ సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధారి, గుడిమెట్‌, తిమ్మాపూర్‌ గ్రామాల్లో తాగునీటి సరఫరా అయ్యే పైప్‌లైన్‌ పగలడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని సర్పంచ్‌ తెలిపారు. దీంతో గ్రామ పంచాయతీ నిదులతో సుమారు 1500 మీటర్ల నూతన పైప్‌లైన్‌ వేస్తున్నామని తెలిపారు. పగిలిన పైపులకు మరమ్మతులు చేస్తున్నామని, పూర్తిగా ధ్వంసమైన చోట కొత్తగా పైప్‌లైన్‌ వేస్తున్నామన్నారు. వారంరోజుల్లో పనులు పూర్తిచేసి …

Read More »