Daily Archives: May 3, 2017

ఉపాధ్యాయ సమస్యలపై జేసికి వినతి

  కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని బుధవారం తపస్‌ ప్రతినిధులు కామారెడ్డి సంయుక్త కలెక్టర్‌ సత్తయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్బంగా తపస్‌ జిల్లాఅధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ ఈనెలలోనే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని కోరారు. జివో 17, 18 లనుఅమలు చేయాలని పేర్కొన్నారు. సర్వీసు రూల్సు రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వెంటనే రూపొందించాలన్నారు. సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాఘవరెడ్డి, రాంచంద్రం, అనిల్‌ పటేల్‌, తదితరులు …

Read More »

కామారెడ్డి జిల్లాలో పాఠశాల దత్తత స్వీకారం

  – విద్యాశాఖ సమీక్షలో జిల్లా కలెక్టర్‌ నిర్ణయం కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విద్య మరింత పటిష్టం చేసేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. ఇందులోభాగంగా పాఠశాల దత్తతకు శ్రీకారం చుట్టారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంఇవోలతో సమావేశం ఏర్పాటు చేశారు. వారితో మాట్లాడి వారికి 34 పాఠశాలలను దత్తత ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆయా పాఠశాలలను గురువారం నుంచి జూన్‌ 11వ తేదీ …

Read More »

మురికి కాలువ నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 21వ వార్డులో సిసి డ్రైన్‌నిర్మాణ పనులను బుధవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరిసుష్మ ప్రారంభించారు. రూ. 2 లక్షల నిధులతో కాలువ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎం.ఇ. భూమేశ్‌, కౌన్సిలర్లు జొన్నల నర్సింలు, బట్టు మోహన్‌, నాయకులు గోనె శ్రీనివాస్‌, దాత్రిక సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Read More »

పదిలో 89.43 శాతం ఉత్తీర్ణత

  – రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాకు 11వ స్థానం కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో కామారెడ్డి 89.43 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 11వస్థానంలో నిలిచింది. జిల్లాగా ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి పది ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించడంతో విద్యాశాఖాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలితాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ విద్యాశాఖాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై వారితో మాట్లాడారు. ఉత్తీర్ణత శాతం మరింత పెంచాలని ఆ దిశగా కృసి చేయాలని …

Read More »

గిరిజన వసతి గృహాల్లో 92.31 శాతం ఉత్తీర్ణత

  కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని వివిద గిరిజనసంక్షేమ వసతి గృహాల్లోచదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థులు ఫలితాల్లో 92.31 శాతం ఉత్తీర్నత సాధించినట్టు జిల్లా గిరిజన సంక్షేమాధికారి జి.గంగాధర్‌ తెలిపారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ బాలుర వసతి గృహ విద్యార్థులు 100 శాతం, గాంధారి 70 శాతం, కౌలాస్‌ 96 శాతం, కామారెడ్డి 62.50 శాతం, పిట్లం 100 శాతం, బాన్సువాడ 95.45 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.

Read More »

పది ఫలితాల్లో నసురుల్లాబాద్‌ 89 శాతం, బీర్కూర్‌ 50 శాతం ఉత్తీర్ణత

  బీర్కూర్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2016-17 విద్యాసంవత్సరం పదవ తరగతి పలితాలు బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో మిశ్రమ పలితాలు వచ్చాయి. నసురుల్లాబాద్‌ మండలంలో 283 మంది విద్యార్థుళు పరీక్షలకు హాజరుకాగా 252 మంది విద్యార్తిని, విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 89 శాతం మంది ఉతీర్ణత శాతం వచ్చింది. బీర్కూర్‌ మండలంలో 213 మంది విద్యార్తులు పరీక్షలకు హాజరుకాగా 117 మంది ఉత్తీర్ణత సాధించి 50 శాతం ఉత్తీర్ణత వచ్చిందని ఎంఇవో గోపాల్‌రావు తెలిపారు. ఫెయిలయిన విద్యార్తులు అధైర్యపడవద్దని …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం సంతృప్తికరంగానే ఉందని దీనిని మరింత పెంచి వంద శాతానికి చేర్చాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా అన్నారు. బుధవారం ఉదయం ప్రగతిభవన్‌లో గత ఏప్రిల్‌ నెలలో జరిగిన ప్రసవాలపై ఐసిడిఎస్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రూపొందించిన క్యాలెండర్‌ ప్రకారం గర్బిణీ స్త్రీల డెలివరి తేదీలను తెలుసుకొని సూపర్‌వైజర్లు, అంగన్‌వాడి కార్యకర్తలు ఇంటింటికి తిరగాలని …

Read More »

అంగన్‌వాడిల పర్యవేక్షణ బాధ్యత కమిటీదే

  గాంధారి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అంగన్‌వాడి కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత అంగన్‌వాడి వెల్పేర్‌ కమిటిదేనని కమిటీ ఛైర్మన్‌ తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం గాంధారి మండల కేంద్రంలోని తనచాంబరులో అంగన్‌వాడి వెల్పేర్‌ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిటీకి ఛైర్మన్‌గా తాను ఉంటానని, సభ్యులుగా ఎండివో, ఎంఇవో, సూపర్‌వైజర్లు ఉంటారన్నారు. ప్రతి నెల అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణపై సమీక్షిస్తామన్నారు. ఖచ్చితంగా ఒక్కో అంగన్‌వాడి కేంద్రంలో 5 నుంచి 10 కి తగ్గకుండా గర్భిణీలు వుండాలని, …

Read More »

వికలాంగుల సమాఖ్య కమిటీ ఏర్పాటు

బీర్కూర్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దుర్కి గ్రామంలో బుధవారం వికలాంగుల సమాఖ్య కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడు గంగాధర్‌ సమక్షంలో ఎన్నిక నిర్వహించారు. నసురుల్లాబాద్‌ మండల కమిటీ అధ్యక్షుడుగా డి.రాములు, బాన్సువాడ మండల అధ్యక్షుడుగా గంగాధర్‌ చారి, బీర్కూర్‌ మండల అధ్యక్షుడుగా ఎం.డి. ఫయాజ్‌, ఉపాధ్యక్షులుగా భాస్కల్ల సాయిలు, ఉపాధ్యక్షుడుగా దయాల శ్రావణ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా గాండ్లసాయిలు, ప్రచార కార్యదర్శిగా చిటిమిల్ల పవన్‌కుమార్‌లను ఎన్నుకున్నారు.

Read More »

గురువారం గొల్లకుర్మ కులస్తుల సమావేశం

  గాంధారి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం గొల్లకుర్మ కులస్తుల సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎండివో సాయాగౌడ్‌తెలిపారు. కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మండల స్తాయి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి హాజరు కానున్నట్టు తెలిపారు. మండలంలోని గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు హాజరు కావాలని ఆయన కోరారు. సొసైటీలలో సభ్యత్వం, గొర్రెల పంపిణీ, పథకం అమలుపై …

Read More »