Breaking News

Daily Archives: May 4, 2017

10వ తరగతి ఫలితాల్లో చైతన్య హైస్కూల్‌ జయకేతనం

  నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సెస్సీ పలితాల్లో నిజామాబాద్‌లోని వర్నిరోడ్డులో గల చైతన్య హైస్కూల్‌ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని పాఠశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఐదుగురు విద్యార్థులు 10కి 9.7 గ్రేడ్‌, ఇద్దరు విద్యార్తులు 9.5 గ్రేడ్‌, ముగ్గురు జిపిఎ సాధించి తమ సత్తాచాటారన్నారు. సబ్జెక్టులవారిగా మంచి ఫలితాలు సాధించారన్నారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలగా మంచి గుర్తింపు పొందిందని కరస్పాండెంట్‌ యోజనరెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా మంచి ఉత్తీర్ణత సాధించిన …

Read More »

ఒంటరి మహిళల సర్వే పకడ్బందీగా పూర్తిచేయాలి

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు ఒంటరి మహిళల జీవన భృతికి అర్హులను ఎంపిక సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి ఒంటరి మహిళల జీవనభృతి, మండలాల్లో, గ్రామాల్లో కార్యాచరణ, ఎంపిడివోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుంచి 13 లోగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలన 9 నుంచి 18వ తేదీ లోగా గ్రామసభలు నిర్వహించి …

Read More »

గొల్ల కుర్మ సభ్యుల సభ్యత్వ నమోదు

  బీర్కూర్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మీర్జాపూర్‌, బీర్కూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో అధికారులు గొల్ల కుర్మ కులస్తుల పేర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గొల్లకుర్మ సభ్యుల సంక్షేమ పథకాలను గ్రామాల్లోకి తీసుకురావడానికి సభ్యుల నమోదు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. గ్రామ గొల్ల కుర్మ సంఘంలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు.

Read More »

బదిలీపై వెళుతున్న పోలీసులకు సన్మానం

  బీర్కూర్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా సేవలందించిన పోలీసులు శ్రీకాంత్‌, పోశెట్టి లను ఏఎస్‌ఐ మజిద్‌ఖాన్‌ గురువారం ఘనంగా సన్మానించారు. ప్రతి ఉద్యోగికి బదిలీ సర్వసాధారణమేనని, ఒకచోట పనిచేసిన మధుర స్మృతులను మరోచోట స్మరిస్తు కాలాన్ని వెళ్లదీయాలని ఆయన అన్నారు. నాలుగేళ్ళుగా బీర్కూర్‌ మండలంలో శ్రీకాంత్‌, పోశెట్టి శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతు పాత్రపోషించారని తెలిపారు. కార్యక్రమంలో కానిస్టేబుల్‌ పెద్దన్న, అంజద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గొర్రెలు తేవడానికి నేనే స్వయంగా వస్తా

  – ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి గాంధారి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం గొల్ల కుర్మలకు పంపినీ చేయనున్న గొర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి తేవడానికి లబ్దిదారులతో తానే స్వయంగా వస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో గొర్రెల యూనిట్ల పంపిణీ పై మండల స్తాయిఅవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలు ఏర్పాటుచేసుకోవాలన్నారు. ఖచ్చితంగా ఆయా గ్రామాల్లోని గొల్ల కుర్మలు …

Read More »

శుక్రవారం నుంచి మన తెలంగాణ – మన వ్యవసాయం

  బీర్కూర్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నుంచి బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో మన తెలంగాణ – మన వ్యవసాయంలో భాగంగా రోజువారిగా ఆయ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని వ్యవసాయాధికారిణి కమల తెలిపారు. ఆయా ప్రాంత మట్టి నమూనాలను బట్టి ఏ రకమైన పంట వేయాలో, ఎటువంటి పంటలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయో, ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడాలో రైతులకు గ్రామసభల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. శుక్రవారం నుంచి 16వ తేదీ వరకు బీర్కూర్‌, …

Read More »

నడిరోడ్డులో ట్రాన్స్‌ఫార్మర్‌

  నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చెడిపోతే మరమ్మతులు చేసి అదే స్థానంలో మరో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తారు. ఇది అందరికి తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం చూస్తే వింతగా ఉందని ప్రజలు అంటున్నారు. నిజామాబాద్‌ నగరంలోని 14వ డివిజన్‌ మైసమ్మ వీధిలో వారంరోజుల క్రితం ట్రాన్స్‌ఫార్మర్‌ కాలి పాడయిపోయింది. విద్యుత్‌ సిబ్బంది పాడయిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను అలాగే ఉంచి పక్కనే నడిరోడ్డులో ట్రాక్టర్‌ ట్రాలీలో మరో ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టి విద్యుత్‌సరఫరా చేస్తున్నారు. ఇది చూస్తేనే భయంకరంగా …

Read More »

శుక్రవారం నుంచి మన తెలంగాణ మన వ్యవసాయం

  గాంధారి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో ఈనెల 5వ తేదీ నుంచి 16 వరకు మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వ్యవసాయాధికారి యాదగిరి తెలిపారు. మొదటిరోజు శుక్రవారం గురుజాల్‌, జువ్వాడి, శనివారం నేరల్‌, నాగులూర్‌, సోమవారం చద్మల్‌, మంగళవారం దుర్గం, బుధవారం బూర్గుల్‌, గురువారం గాంధారి, శుక్రవారం పేట్‌సంగం, మాత్‌సంగం, 13వ తేదీన గండివేట్‌, ముదెల్లి, 15న వెంకటాపూర్‌, గౌరారం, 16న పోతంగల్‌, సితాయిపల్లి గ్రామాల్లోని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రైతులకు …

Read More »

చద్మల్‌లో అగ్నిప్రమాదం

  గాంధారి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని చద్మల్‌ తాండాలో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు, తహసీల్దార్‌ ఎస్‌.వి. లక్ష్మణ్‌ కథనం ప్రకారం… బుధవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో రెండు నివాసపు గుడిసెలతో పాటు మూడు పశువుల పాకలు కాలి బూడిదయ్యాయి. తాండాకు చెందిన బన్సి దౌలత్‌ రావ్‌, బన్సి నారాయణల నివాసపు గుడిసెలు, రాతన్‌ సింగ్‌, హరిదాస్‌, బిచ్చాలకు చెందిన పశువుల పాకలు ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనం, …

Read More »

డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

  గాంధారి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని పిడిఎస్‌యు నాయకులు ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డికివినతి పత్రం సమర్పించారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను కలిసి గాంధారిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ప్రతి సంవత్సరం మండలంలోని 400 నుంచి 500 మంది విద్యార్తులు ఇంటర్‌లో ఉత్తీర్ణత పొంది వేరే పట్టణాలకు ఉన్నత చదువులకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. నిజామాబాద్‌,కామారెడ్డి, బాన్సువాడ వంటి పట్టణాలకు …

Read More »