Breaking News

Daily Archives: May 5, 2017

వైభవంగా వాసవీమాత జయంతి వేడకలు

  కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం వైశ్యుల కులదైవం శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుమారు రెండువేల మంది మహిళలు సామూహికంగా కళశాలు ఎత్తుకొని గాంధీగంజ్‌నుంచి ఊరేగింపుగా వాసవీ ఆలయానికి వెళ్లి అభిషేకం చేశారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం, కుంకుమపూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పార్శి రాజేందర్‌, ఉత్సవ కమిటీ కన్వీనర్‌ పార్శి కాంశెట్టి, ప్రతినిదులు కొండ భైరయ్య, కైలాష్‌ శ్రీనివాస్‌ రావు, ముప్పారపు ఆనంద్‌, జూలూరి భారతమ్మ, …

Read More »

రైతులకు వ్యవసాయంపై అవగాహన

  గాంధారి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో మన తెలంగాణ – మన వ్యవసాయం కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. మొదటిరోజు మండలంలో గుర్జాల్‌, జువ్వాడి గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయంలో తీసుకునే మెళకువలను వ్యవసాయ అధికారి యాదగిరి వివరించారు. అదేవిధంగా పాడి పరిశ్రమపై కూడా రైతులకు పశు వైద్యాధికారి రవికిరణ్‌ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.

Read More »

10వ తరగతి విజేతలకు కలెక్టర్‌ అభినందన

  కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన లింగంపేట బాలికల ఉన్నత పాఠశాల విద్యార్తినిలను శుక్రవారంజిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌లు అభినందించారు. పాఠశాలకు చెందిన బొల్లు హర్ష, సమీనలు 10/10 జిపిఎ సాధించారు. పది మంది విద్యార్థులు 9 జిపిఎలకు పైగా సాధించారు. ఇంగ్లీష్‌ మీడియంలో 100 శాతం, తెలుగు మీడియంలో 97 శాతం ఫలితాలు పాఠశాల సాధించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయురాలు చంద్రవతి, ఉపాధ్యాయినిలు సుమిత్రానంద్‌, …

Read More »

ఘనంగా ఆరాధనోత్సవం

  కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో శుక్రవారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 324 ఆరాధనా మహోత్సవాన్ని తెలంగాణ విశ్వబ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వైశాఖ శుద్ద దశమి నాడు సమాజంలో కుల, మత, వర్గ విభేదాలు వీడి ప్రజలు ప్రశాంతంగా జీవించాలని చెప్పి వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి పొందారన్నారు. కాలజ్ఞానాన్ని ప్రపంచానికి అందజేసిన మహాజ్ఞాని, తత్త్వవేత్త వీరబ్రహ్మేంద్రస్వామి అని కొనియాడారు. అనంతరం యజ్ఞం నిర్వహించారు. కార్యక్రమంలో కామారెడ్డి విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిదులు సుదర్శన్‌, స్వర్ణకార సంఘం …

Read More »

రాజ్యాధికారమే బిసిల అంతిమ లక్ష్యం

  బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యం కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాధికారమే బిసిల అంతిమ లక్ష్యమని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యం అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాజిక తెలంగాణ సాధించాలన్న అంతిమ లక్ష్యంతో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కన్వీనర్లతోపాటు మండల, గ్రామస్థాయి సమన్వయ కర్తలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీరికి …

Read More »

ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం

  కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 324 ఆరాధనా మహోత్సవాన్ని తెలంగాణ విశ్వబ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వైశాఖ శుద్ద దశమి నాడు సమాజంలో కుల, మత, వర్గ విభేదాలు వీడి ప్రజలు ప్రశాంతంగా జీవించాలని చెప్పి వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి పొందారన్నారు. కాలజ్ఞానాన్ని ప్రపంచానికి అందజేసిన మహాజ్ఞాని, తత్త్వవేత్త వీరబ్రహ్మేంద్రస్వామి అని కొనియాడారు. అనంతరం యజ్ఞం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు సంగయ్య, వడ్ల బీమయ్య, …

Read More »

ఆడపిల్లలకు అండ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌

  – ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నందిపేట, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి పేద ఆడపిల్లకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటూ వారి తల్లిదండ్రుల భారాన్ని ప్రభుత్వం మోస్తుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచుల కోసం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకంలో అర్హులైన 85 మంది పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రూ. 51 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఈ …

Read More »

సీతాయిపల్లిలో ఎడ్లబండ్ల ప్రదర్శన

  గాంధారి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని సీతాయిపల్లి గ్రామంలో శుక్రవారం ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. స్తానిక ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలో ఎడ్లబండ్లను అందంగా అలంకరించి ప్రదర్శించారు. ఎడ్లకు సైతం రకరకాల రంగులతో అందంగా ముస్తాబు చేశారు. శుక్రవారం సాయంత్రం రథోత్సవం, శోభాయాత్ర వుంటుందని గ్రామస్తులు తెలిపారు.

Read More »

క్రీడా సామగ్రి దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

  కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన ఎన్‌.ఎన్‌ క్రీడా దుకాణాన్ని శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు కావాల్సిన క్రీడా పరికరాలను క్రీడాకారులకు అందుబాటులో ఉంచి వ్యాపార అభివృద్ది చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దుకాణం యజమాని బాల్‌ నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఈనెల 7, 14 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం

  నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ సిఇవో బన్వర్‌లాల్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. 01.05.2017 వరకు జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన యువత ఎంతమంది ఉన్నారో అందరికి ఓటరు నమోదు చేసుకునేవిధంగా, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు సంబంధించిన ఫారమ్‌లను సిద్దంగా ఉంచుకోవాలని …

Read More »