Breaking News

కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో ఎంపి క‌విత భేటీ

ప‌సుపు బోర్డు ఏర్పాటును వేగ‌వంతం చేయాలి
ప‌సుపు దిగుమ‌తుల‌పై నిషేధం విధించాలి
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల సహాయ మంత్రి నిర్మల సీతారామన్‌తో  స‌మావేశ‌మ‌య్యారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత. ఈ సంద‌ర్భంగా మంత్రికి ప‌సుపు  రైతుల‌ను ఆదుకునేందుకు ముఖ్య‌మైన మూడు అంశాల‌ను ప్ర‌స్తావించిన కవిత వాటి అమ‌లు కోసం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.
ప‌సుపు రైతులు జాతీయ ప‌సుపు బోర్డును ఏర్పాటు చేయాల‌ని దీర్ఘ‌కాలంగా డిమాండ్ చేస్తున్నార‌ని, బోర్డు ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. తాను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోఢీతో స‌మావేశ‌మైన రెండు సార్లు ఈ విష‌యాన్ని ప్ర‌ధాని దృష్టికీ తీసుకెళ్లినిట్లు చెప్పారు. అలాగే లోక్‌స‌భ ప్ర‌శ్నోత్త‌రాల్లోనూ పలుమార్లు ప్ర‌స్తావించాన‌ని, గ‌త మార్చి 24న ప్ర‌యివేటు మెంబ‌ర్ బిల్లును కూడా లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన‌ట్లు ఎంపి క‌విత మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు వివ‌రించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ‌లో ట‌ర్మ‌రిక్  స్పైస్ పార్కు ఏర్పాటు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.30 కోట్లు మంజూరు చేసింద‌ని, 42 ఎకరాల భూమిని కూడా  సేక‌రించింద‌ని క‌విత తెలిపారు. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని స్పైస్‌ బోర్డ్ డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌)ను రూపొందిస్తున్న‌ద‌ని చెప్పారు. స్పైస్ పార్క్‌ను సంద‌ర్శించాల‌ని ఈ సంద‌ర్భంగా ఎంపి క‌విత మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌ను ఆహ్వానించారు. సుగంధ ద్ర‌వ్యాల‌ ఎగుమ‌తి దారుల‌చేత‌ పెట్టుబ‌డులు పెట్టేలా ప్రోత్సాహ‌క మ‌ద్ధ‌తును ఇవ్వాల‌ని క‌విత కోరారు. దీని వ‌ల్ల ప‌సుపు రైతుల‌కు ఎక్కువ ధ‌ర ల‌భిస్తుంద‌న్నారు.
మ‌న దేశంలోకి ప‌సుపు దిగుమ‌తి కాకుండా నిషేధం విధించాల‌ని కోరారు.  గ‌త ఐదేళ్ల‌లో దిగ‌మ‌తులు హెచ్చ‌రిక స్థాయికి చేరాయ‌న్నారు. నాసి ర‌కం ప‌సుపు ర‌కాల దిగుమ‌తిని నిషేధించ‌క పోతే రాబోయే రోజుల్లో ప‌సుపు రైతులు తీవ్రంగా ఇబ్బంది ప‌డుతార‌ని క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *