Breaking News

Daily Archives: May 10, 2017

లఘుచిత్రాల ఎంపికలో కామారెడ్డి జిల్లా విద్యార్థుల ప్రతిభ

  కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల చిత్రపురి ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డు 2017 పేరుతో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్వహిస్తున్న ఇందూరు తిరుమల గోవింద వనమాల ట్రస్టు వారు రవీంద్రభారతిలో లఘుచిత్రాల ఎంపిక నిర్వహించారు. ఇందులో భారతదేశం నుంచి పలుభాషా చిత్రాలు పోటీకి వచ్చాయి. ఇందులో 5 వేల చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. వాటిలోంచి పది ఉత్తమ చిత్రాలను జ్యూరి కమిటీ ఎంపిక చేసింది. దానిలో నిర్మాత దిల్‌రాజు, వారి బృందం చేతుల మీదుగా కామారెడ్డి విద్యార్థులు అవార్డు …

Read More »

కామారెడ్డిలో ఎయిర్‌టెల్‌ 4జి

  కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే వేగవంతమైన నెట్‌వర్క్‌ కలిగి ఉండి కోట్లాది మంది వినియోగదారులు కలిగిఉన్న ఎయిర్‌టెల్‌ సంస్థ వినియోగదారులకు మరింత సులభంగా డాటా కాల్స్‌ను అందజేసేందుకుగాను 4జి సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. అందులో భాగంగానే బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైదరాబాద్‌, మెదక్‌ జోనల్‌ బిజినెస్‌ మాన్‌ విక్రం చంద్‌ ఎయిర్‌టెల్‌ 4జి సేవలను కేక్‌ కట్‌చేసి ప్రారంభించారు. వినియోగదారులకు అతిచౌకగా కాల్స్‌తోపాటు డైలీ 1 జిబి డేటాను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. 349 …

Read More »

భూసార పరీక్షల ఆదారంగా రైతులు పంటలు సాగుచేయాలి

  మోర్తాడ్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిరైతు భూసార పరీక్షలు చేయించుకొని అందుకనుగుణంగా పంటలు సాగుచేయాలని డాట్‌సెంటర్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పవన్‌చంద్రారెడ్డి, జిల్లా ఎడిఎ జగదీశ్వర్‌లు అన్నారు. బుధవారం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచ్‌ ఉగ్గెర భూమేశ్వర్‌ అధ్యక్షతన మన తెలంగాణ – మన వ్యవసాయం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసి రైతులనుద్దేశించి వారు మాట్లాడారు. రైతులు పంటలకు సరైన మోతాదులో ఎరువులు వాడాలని సూచించారు. ఖరీఫ్‌లో పంటలు …

Read More »

ఏర్గట్ల తహసీల్దార్‌గా ఎం.కె.ముల్తాజుద్దీన్‌

  మోర్తాడ్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల మండలం నూతనంగా ఏర్పడిన నేపథ్యంలో మొట్టమొదటి తహసీల్దార్‌గా ఎం.కె.ముల్తాజుద్దీన్‌ తహసీల్‌ కార్యాలయంలో బాద్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆర్‌ఐ రవిందర్‌తో కలిసి ఆయా గ్రామాల్లో బుధవారం పర్యటించారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ అవినీతి, అక్రమ వ్యాపారాలను నియంత్రిస్తానని, ప్రజలకు సేవలందిస్తానని తెలిపారు.

Read More »

పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

  మోర్తాడ్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలందరు కృషి చేయాలని మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియా అన్నారు. బుధవారం మోర్తాడ్‌ మండలంలోని పాలెం గ్రామంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏప్రభుత్వం చేయని విధంగా సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో అన్ని వర్గాల, అన్ని గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలు అమలుచేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది పథకాలు అర్హులకు …

Read More »

విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు సెమినార్‌

  మోర్తాడ్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులను ఎస్‌ఎస్‌సిలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు గ్రామ రిటైర్డ్‌ ఉద్యోగులతో, ఉపాద్యాయులతో గ్రామ పోలీసుశాఖ, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సెమినార్‌ ఏర్పాటు చేస్తామని ఏర్గట్ల సర్పంచ్‌ శ్రీవైష్ణవి, ఎంపిటిసిలు జక్కని సంధ్యారాణి, అంజయ్యలు అన్నారు. బుధవారం ఏర్గట్ల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 10/10, 9.8 గ్రేడ్లు సాధించిన సాయికృష్ణ, శ్రీరాములు, సాయికీర్తిలతో పాటు విద్యార్థులను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. …

Read More »

19వ వార్డులో బోరు పనులు ప్రారంభం

  కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 15వ వార్డులో బోరు మోటారును వార్డు కౌన్సిలర్‌ శశిరేఖ దయానంద్‌రావు ప్రారంభించారు. శాసనమండలి ప్రతిపక్షనేత ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ప్రత్యేక నిధులు 3 లక్షలతో వార్డులో ముదాంగల్లి, బర్కత్‌పుర కాలనీల్లో బోరు మోటారు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. వార్డులో తాగునీటి సమస్య దృష్టిలో పెట్టుకొని నిధులు మంజూరు చేసిన షబ్బీర్‌ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకులు కృపాల్‌, కాలనీ వాసులు రషీద్‌, మాణిక్యం, …

Read More »