Breaking News

Daily Archives: May 11, 2017

సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్ష

  కామారెడ్డి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 6వ స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఇందులో అన్ని సంక్షేమ శాఖల యొక్క ప్రగతిని నివేదించారు. ముఖ్యంగా హరిజన, గిరిజన, వెనకబడిన, మైనార్టీ సంక్షేమశాఖ, మహిళ, పిల్లలు, వృద్దుల శాఖ, ఇంజనీర్లు ఆయా శాఖలకు సంబంధించిన చేపట్టిన, పూర్తిచేసిన పనుల వివరాలు చదివి వినిపించారన్నారు. జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు. అలాగే సంక్షేమ అధికారులతో పాటు తూనికల, కొలతల …

Read More »

అదుపుతప్పి గుంతలోకి లారీ…

  బీర్కూర్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఓ లారీ గుంతలో పడింది. లారీ డ్రైవర్‌ గుంతను గమనించక పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. కాగా డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా బయటపడ్డారు. 29 కోట్ల రూపాయలతో బీర్కూర్‌, బాన్సువాడ, కోటగిరి మండలాలను అనుసంధానం చేస్తు నిర్మిస్తున్న రహదారి పనుల గుత్తేదారు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. ఎటువంటి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో తరుచూ ప్రమాదాలు …

Read More »

గొల్ల కుర్మ లబ్దిదారుల ఎంపిక

  బీర్కూర్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో తహసీల్దార్‌ డేవిడ్‌ ఆధ్వర్యంలో గురువారం గొల్లకుర్మ సభ్యుల ఎంపిక నిర్వహించారు. మండలంలో మొత్తం 147 మంది లబ్దిదారులు దరఖాస్తు చేసుకోగా డ్రా పద్దతి ద్వారా ప్రభుత్వం కల్పించే పథకానికి అర్హులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. గొల్ల కుర్మలు ఆర్థికంగా అభివృద్ది చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఇట్టి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌, పశు వైద్యాధికారి సురేశ్‌, ఆర్‌ఐ …

Read More »

మా భూమి – మా పంట సమగ్ర రైతు సర్వే

  బీర్కూర్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 12, 13 తేదీలు శుక్ర, శని వారాల్లో బీర్కూర్‌ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మా భూమి – మా పంట సమగ్ర రైతు సర్వే చేపడుతున్నట్టు ఏఇవో శ్రావణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే సంవత్సరం ఖరీఫ్‌ 2018 పంటకు ఎకరానికి 4 వేలు, యాసంగి 2018-19 పంటకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు నగదు బదిలీ నేరుగా పంపిణీ చేసే సర్వే చేపడుతున్నామన్నారు. …

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

  బీర్కూర్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఉద్యోగుల మహాసభ గోడప్రతులను గురువారం మండల అభివృద్ది అదికారి భరత్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి కీలక నిర్నయాలు మహాసభలో నిర్ణయించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అరిగె సాయిలు, కారోబార్ల జిల్లా ఉపాధ్యక్షుడు గంగారాం, మండల అధ్యక్షుడు రతన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఇంటర్‌ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

  కామారెడ్డి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలను నిష్పక్షపాతంగా, ఎటువంటి వివాదాలకు చోటివ్వకుండా, పారదర్శకంగా, చూచిరాతలు, చీటి రాతలు లేకుండా సజావుగా జరిగేటట్టుగా అందరు అధికారులు ప్రవర్తించాలని జిల్లా జాయింట్‌కలెక్టర్‌ సత్తయ్య పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంట్‌ ఆఫీసర్స్‌, కస్టోడియన్స్‌, ఫ్లైయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా …

Read More »