Breaking News

Daily Archives: May 12, 2017

దీక్షకు అనుమతివ్వండి

  – టిడిపి మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌ నందిపేట, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసిలకు రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్‌ ఈనెల 18, 19 తేదీల్లో నందిపేట మండల కేంద్రంలో దీక్ష చేయనున్నారు. ఈ మేరకు దీక్షకు అనుమతివ్వాలని కోరుతూ శుక్రవారం టిడిపి మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌ ఆద్వర్యంలో నాయకులు తహసీల్దార్‌ ఉమాకాంత్‌కు వినతి పత్రం అందజేశారు. బిసిలకు 12 శాతం, ఎస్సీలకు 18 శాతం, అగ్రకులాలలోని పేదలకు ప్రత్యేక బడ్జెట్‌ …

Read More »

రోడ్డెక్కిన రైతులు

  నందిపేట, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతో వ్యయప్రయాసల కోర్చి పండించిన పంటను పిఏసిఎస్‌ కొనుగోలు కేంద్రంలో సకాలంలో పంట కొనుగోలు చేయడం లేదని నందిపేట మండలం వెల్మల్‌ గ్రామ రైతులు శుక్రవారం రోడ్డెక్కారు. సుమారు 30 మంది రైతులు వెల్మల్‌ ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జాన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను శాంతింపజేశారు. వరి ధాన్యం ఆరబెట్టుకొని చాలా రోజులవుతుందని, వడగండ్ల వాన పడితే, వర్షం కురిస్తే నష్టపోవాల్సి వస్తుందని, అందుకే …

Read More »

జీవ ఎరువుల వాడకంతో మంచి దిగుబడి

  నందిపేట, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవ ఎరువుల వాడకంతోనే పంటలో మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయాధికారి పద్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నందిపేట మండలంలోని బాద్గుణ, ఉమ్మెడ, సి.హెచ్‌.కొండూరు గ్రామాల్లో మన తెలంగాణ – మన వ్యవసాయం సంబంధించిన రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ విత్తనశుద్ది, భూసార పరీక్షలు, రైతు సమగ్ర సర్వే తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాద్గుణ సర్పంచ్‌ కవిత, ఉమ్మెడ సర్పంచ్‌పోశెట్టి, సి.హెచ్‌.కొండూరు సర్పంచ్‌ …

Read More »

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  మోర్తాడ్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మ యాదవులకు జీవనోపాధి కల్పించేందుకు ఒక్కో యూనిట్‌ కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల విలువ గల గొర్రెలు, మేకలు అందజేస్తుందని ఈ అవకాశాన్ని గొల్ల కుర్మలు సద్వినియోగం చేసుకొని లబ్దిపొందాలని ఎంపిడివో శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని దోన్‌పాల్‌ గ్రామంలో స్థానిక సర్పంచ్‌ లింగన్న అధ్యక్షతన గొల్ల కుర్మ యాదవుల సమావేశం నిర్వహించారు. మొదటి విడత డ్రా పద్దతిలో 17 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. ఒక్కో …

Read More »

అన్ని శాఖల సమన్వయంతో హరితహారం..

  నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈయేడు 2017-18 కిగాను కోటి 85 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, శాఖల వారిగా నిర్దేశించిన లక్ష్యం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా అన్నారు. శుక్రవారం ఉదయం ప్రగతిభవన్‌లో అన్ని శాఖల అధికారులతో హరితహారంపై సమీక్షించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని వేసవి కాబట్టి మొక్కలు ఎండకుండా నీటిని అందించాలని సూచించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఎంఇవోలు మొక్కలకు నీరు అందించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు, …

Read More »

ఆరోగ్య లక్ష్మి హాజరు 100 శాతం పెంచాలి

  కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య లక్ష్మి హాజరు శాతం 100కు పెంచడానికి కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ మహిళ, శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్లకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ సమీక్ష నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి రాధమ్మ, ఐసిడిఎస్‌ సిడిపివోలు, సూపర్‌వైజర్లు హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా 100 శాతం కృషి చేయాలని సూచించారు. అంగన్‌వాడి టీచర్లందరు పనిచేసే స్థలంలోనే ఉండాలని, …

Read More »

ఉపాధి కూలీలకు జాబ్‌కార్డులు, మెడికల్‌ కిట్‌ల పంపిణీ

  మోర్తాడ్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తడపాకల్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్‌ లోలం లావణ్య ఉపాధి కూలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నూతన జాబ్‌కార్డులను, మెడికల్‌ కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ కూలీలకు త్వరితగతిన వేతనాలు, పనులు కల్పించేందుకు ఆన్‌లైన్‌ నమోదు చేయడమే గాకుండా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా కొత్త జాబ్‌కార్డులు అందజేసిందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌, వార్డుసభ్యులు, పీల్డ్‌ అసిస్టెంట్‌, …

Read More »

14న పంచాయతీ రాజ్‌ రాష్ట్ర మహాసభ జయప్రదం చేయండి

  మోర్తాడ్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంచాయతీ రాజ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలంటూ ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని మండల కారోబార్లు కోరారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయం ముందు రాష్ట్ర మహాసభ గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలంటూ, ప్రభుత్వ గ్రాంట్‌ కింద వేతనాలు చెల్లించాలంటూ పలు సమస్యలపై మహాసభ నిర్వహించి ప్రభుత్వ దృస్టికి తీసుకెళ్తామన్నారు. సర్పంచ్‌ల సంఘం సహకారంతో రాష్ట్ర పంచాయతీ …

Read More »

తెరాసతోనే అభివృద్ధి

  మోర్తాడ్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రబుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గ్రామాల అభివృద్దికి ఎనలేని కృసి చేస్తున్నారని ధర్మోరా సర్పంచ్‌ రాజేందర్‌, ఎంపిటిసి లత అన్నారు. శుక్రవారం మండలంలోని ధర్మోర గ్రామ పెద్ద చెరువు మిషన్‌ కాకతీయ పథకం కింద సర్పంచ్‌, ఎంపిటిసిలు పనులు ప్రారంభించారు. శుక్రవారం నుంచి చెరువు కట్ట మరమ్మతులు చేపడుతున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, విడిసి సభ్యులు పాల్గొన్నారు.

Read More »

16న కామారెడ్డి జిల్లా అభివృద్ది సమన్వయ మానిటరింగ్‌ కమిటీ సమావేశం

  కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న వివిధ కార్యక్రమాలపై, నిధుల విడుదల, వినియోగం తదితర అంశాలపై ఈనెల 16వ తేదీన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం ఉదయం 11 గంటలకు జనహిత సమావేశమందిరంలో ఉంటుందన్నారు. డిఆర్‌డిఎ, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నీటిపారుదల, వ్యవసాయం, ఐసిడిఎస్‌, మధ్యాహ్న భోజనం, సివిల్‌ సప్లై, …

Read More »