Breaking News

Daily Archives: May 15, 2017

నిర్దేశించిన పనులు సకాలంలో పూర్తిచేయాలి

  కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానంగా వచ్చే నెలలో ప్రారంభించనున్న హరితహారం కార్యక్రమంపై అధికారులు దృష్టిసారించి విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా జనహిత భవనంలో జిల్లా అధికారులతో సోమవారం కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత వారంలో ఆదేశించిన, చేయవలసిన పనుల సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకొని, తదుపరి కార్యాచరణ రూపొందించారు. అలాగే ప్రస్తుతం నాటిన చెట్లకు నీరు అందించే ట్రాక్టర్లను కూడా …

Read More »

21వరకు ఒంటరి మహిళల దరఖాస్తుల పొడగింపు

  నిజామాబాద్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ఒంటరి మహిళల కోసం ఆసరా పింఛన్‌ అందించనుంది. ఇందుకుగాను ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు మే 13వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. లబ్దిదారుల డిమాండ్‌ మేరకు ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణప్రాంతాల్లో కూడా మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని …

Read More »

నీటి ఎద్దడిని నివారించండి

  నందిపేట, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్నారం గ్రామ 1వ వార్డు దళిత ప్రజలు తమ కాలనీలో నీటి ఎద్దడి సమస్య తీర్చాలని కోరుతూ సోమవారం మండల అధికారి నాగవర్ధన్‌కు వినతి పత్రం సమర్పించారు. గత నెలరోజుల నుండి దళిత వాడలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. సర్పంచ్‌, గ్రామ కార్యదర్శికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎండివో స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. వారితోపాటు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సాగౌడ్‌, అడ్వకేట్‌ కృష్ణారెడ్డి, తదితరులున్నారు.

Read More »

జీవ ఎరువుల వాడకంతో మంచి దిగుబడి

  నందిపేట, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవ ఎరువుల వాడకంతోనే పంటలో మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయాధికారి పద్మ అన్నారు. ఈ మేరకు సోమవారం నందిపేట మండలంలోని అయిలాపూర్‌, కంఠం, మల్లారం గ్రామాల్లో మన తెలంగాణ – మన వ్యవసాయం సంబంధించిన రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ విత్తనశుద్ది, భూసార పరీక్షలు, రైతు సమగ్ర సర్వే తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మల్లారం గ్రామ సర్పంచ్‌ దివ్వరాజు, అయిలాపూర్‌ సర్పంచ్‌ సుదర్శన్‌, …

Read More »

అనారోగ్యానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన తెరాస నాయకులు

  మోర్తాడ్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్‌ గ్రామానికి చెందిన నేరెళ్ల లింగారెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి 11 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అంతేగాకుండా అనారోగ్యానికి గురైన వ్యక్తిని హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలని స్తానిక నాయకులకు సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఏర్గట్ల మండల తెరాస అధ్యక్షుడు రాజాపూర్ణానందం, సర్పంచ్‌ ప్రభాకర్‌, సొసైటీ వైస్‌ఛైర్మన్‌ దోంచంద శ్రీను, రవిలు సోమవారం ఆసుపత్రికి తరలించారు.

Read More »

వడదెబ్బతో వ్యక్తి మృతి

  మోర్తాడ్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో ఆదివారం అదేగ్రామానికి చెందిన నరేశ్‌ (26) వడదెబ్బతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు నరేశ్‌ భార్య గర్భిణీగా ఉందని స్థానికులు తెలిపారు. నరేశ్‌ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడని, గత ఐదురోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడని, జ్వరంతో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆర్మూర్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు మూత్ర, రక్త పరీక్షలు చేయాలని తెలపడంతో నరేశ్‌ …

Read More »

గొల్ల కుర్మల అభివృద్దే తెరాస ధ్యేయం

  మోర్తాడ్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొల్ల కుర్మల అభివృద్దే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపిపి కల్లడ చిన్నయ్య, సర్పంచ్‌లు దడివెనవీన్‌, నాగం పోశన్న, తహసీల్దార్లు సూర్యప్రకాశ్‌లు అన్నారు. సోమవారం మండలంలోని పాలెం, ఒడ్యాట్‌ గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో స్థానిక సర్పంచ్‌ల అధ్యక్షతన ఆయా గ్రామాల గొల్ల కుర్మలతో సమావేశం నిర్వహించారు. ఒడ్యాట్‌ గ్రామంలో వందమంది సంఘ సభ్యులుండగా మొదటి విడత డ్రా పద్దతిలో 50 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. మోర్తాడ్‌లో డ్రా …

Read More »

ఆదర్శ పాఠశాలగా మైలారం ప్రాథమిక పాఠశాల

  బీర్కూర్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మైలారం గ్రామంలోగల ప్రాథమిక పాఠశాలను మండలంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పాఠశాల ప్రధానోపాద్యాయుడు విఠల్‌ అన్నారు. మండలంలో ప్రతి ఒక్క పాఠశాలను పిఆర్‌టియు ఆధ్వర్యంలో దత్తత తీసుకొని పాఠశాలలను ఆదర్శంగా చేయాలనే లక్ష్యంగా ఉందన్నారు. గ్రామంలో సోమవారం గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలు అభివృద్ది విషయాలపై చర్చించారు. సర్పంచ్‌ సాయిరాం యాదవ్‌, ఎంపిటిసి మహేందర్‌, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆసుపత్రి కోసం వినతి

  బీర్కూర్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సత్‌సేవా యూత్‌ సంఘ్‌ సభ్యులు డిప్యూటి తహసీల్దార్‌ హేమలతకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. నూతనంగా ఏర్పడిన నసురుల్లాబాద్‌ మండలంలో హాజీపూర్‌, సంగెం గ్రామాలను కలిపి సుమారు 5 వేల మంది జనాభా ఉంటారని, పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన వారుకాబట్టి ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువులకోసం పశువుల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో …

Read More »

ఒంటరి మహిళకు ఆసరా…

  నిజాంసాగర్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట, ఆరేపల్లి గ్రామాల్లో ఒంటరి మహిలలకు పింఛన్‌ అందించేందుకోసం దరఖాస్తులు స్వీకరించేందుకు గ్రామసభలు ఏర్పాటు చేశారు. అచ్చంపేట గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఐదుగురు ఒంటరి మహిళలు దరఖాస్తుచేసుకోగా, ఆరేపల్లిలో ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. ఈసందర్బంగా ఎంపిడిఓ రాములు నాయక్‌ మాట్లాడుతూ ఒంటరి మహిళల కోసం ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం పింఛన్‌ అందిస్తుందని స్పష్టంచేశారు. గ్రామాల్లో ఒంటరి మహిళల వివరాలు సేకరించాలని సూచించారు.

Read More »