Breaking News

వారిని దేశంలో అడుగుపెట్టనీయకండి..

వాషింగ్టన్: అమెరికాలో ముస్లిం జనాభా పెరిగిపోతున్నదని, అందువల్ల మెజరీటి ముస్లిం దేశాల వారికి వీసాలు ఇవ్వడం ఆపేసి, అధ్యక్షుడు ట్రంప్ మంచి నిర్ణయం తీసుకున్నాడని డబ్ల్యూఎమ్‌డి న్యూస్ ఎడిటర్ లీ హోమాన్, అధ్యక్షుడు ట్రంప్‌ను అభినందించారు. ముస్లిం జనాభా పెరిగితే, అమెరికాలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనని విషయాలను వివరించేందుకు ఆయన ‘స్టీల్త్ ఇన్వెషన్ ముస్లిం కన్‌క్వేస్ట్ త్రో ఇమ్మిగ్రేషన్ అండ్ ది రిసెటిల్‌మెంట్ జిహద్’ అనే పేరుతో పుస్తకాన్ని కూడా రాశారు. అమెరికాలో మొత్తం 32,00ల వరకు మసీదులున్నాయని, వాటిలో చాలావాటికి సౌదీ అరేబియా ప్రభుత్వమే ధనసహయం చేస్తోందన్నారు.

అలాగే చాలామంది ముస్లింలు అమెరికా వచ్చి, ఉగ్రవాద కార్యకాలపాలు నిర్వహిస్తున్నారని, స్థానిక అమెరికన్ పౌరులు కూడా వారికి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. అది అందరినీ ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ముస్లిం మతపెద్దలైన ఇమ్మామ్‌లకు అమెరికా ఆర్1 వీసాలు మంజూరు చేస్తుందని, వాటిని నిలిపేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వీసా పేరుతో వారు ఇక్కడే స్థిరపడి, జీహద్‌ను విస్తారించడానికి ప్రయత్నిస్తుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి వారికి వీసాలివ్వడం వల్ల దేశంలో అశాంతి తలెత్తుందని, అందువల్ల వారికి ఎటువంటి వీసాలు మంజూరు చేయొద్దంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని దేశంలో అడుగుపెట్టనియొద్దంటున్నారు. వారు దేశంలో అడుగుపెడితే, అది అమెరికాకు  ఆత్మహత్యసాదృశ్యామేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Check Also

డిమాండ్‌ ఉన్న పంటలు వేస్తే ఈజీగా అమ్ముకోవచ్చు…

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రైతు రాష్ట్రంలోని ఇతర ప్రాంత రైతుల‌కు ఆదర్శవంతంగా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *