Breaking News

Daily Archives: May 16, 2017

చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ఎన్‌ఆర్‌ఐ విరాళం

  కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహం ఎదుట ఏర్పాటు చేస్తున్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎన్‌ఆర్‌ఐ జూకంటి అనిల్‌రెడ్డి రూ. 25 వేలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు అనిల్‌రెడ్డి బంధువు ఉమేశ్‌రెడ్డి 25 వేల చెక్కును రజకసంఘం ప్రతినిదులకు అందజేశారు. కార్యక్రమంలో రజక సంఘం పట్టణ యువజన అధ్యక్షుడు నర్సోల్ల మహేశ్‌, ఉపాధ్యక్షుడు ఓరుగంటి మహేశ్‌, ప్రవీణ్‌, శ్రీనివాస్‌, రాజు, రతన్‌, తదితరులున్నారు.

Read More »

బిజెవైఎం జిల్లా కార్యదర్శిగా భాస్కర్‌

  కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెవైఎం కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా భాస్కర్‌ను నియమిస్తు మంగళవారం కామారెడ్డిలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. ఈమేరకు ఆయనకు నియామకపత్రం అందజేశారు. విద్యార్థి పరిషత్‌జిల్లా కన్వీనర్‌గా భాస్కర్‌ బాద్యతలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఆయనకు బిజెవైఎంలో బాధ్యత అప్పగించారు. బిజెపి జిల్లాఅధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు జూలూరి సుధాకర్‌లు భాస్కర్‌కు నియామకపత్రం అందజేశారు.

Read More »

జిల్లాను ప్రగతి పథంలో నడపాలి

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్ళెందుకు అందరు అధికారులు కృషి చేయాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, మండల అభివృద్ది అధికారులు, డిఆర్‌డిఓ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.అన్ని సంక్షేమ పథకాలు వాటి అమలు తీరుపై చర్చించారు. హరితహారంపై మాట్లాడుతూ మొక్కల్ని నాటి వాటి సంరక్షణ బాధ్యతను ప్రతి వ్యక్తి నిర్వహించాలని, వాటికి సంబంధించి కమ్మినల్‌ ట్రాక్టర్లను మండల …

Read More »

వరికుప్పపై ప్రాణాలు వదిలిన రైతన్న

  కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొన్న పసుపుకుప్పపై ప్రాణాలు వదిలిన రైతన్న సంఘటన మరువకముందే మరోరైతు వరికుప్పపై ప్రాణాలు వదిలిన సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామకు చెందిన ఆకుల పోశయ్య (65) మంగళవారం ఉదయం వరికుప్పపై ప్రాణాలు వదిలాడు. గత ఆరురోజులుగా వరిధాన్యం విక్రయించేందుకు గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం కురిసిన వర్షంతో ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం …

Read More »

ముగిసిన మన తెలంగాణ- మన వ్యవసాయం

  గాంధారి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. గత పదిరోజులుగా గాంధారి మండలంలోని 19 గ్రామపంచాయతీలలో వ్యవసాయశాఖ అధికారులు, రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించారు. చివరిరోజు మంగళవారం మండలంలోని సీతాయిపల్లి, పోతంగల్‌ కలాన్‌ గ్రామాల్లో మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా రైతులు, గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయాధికారి యాదగిరి మాట్లాడుతూ రైతులు సేంద్రీయ వ్యవసాయంవైపు మొగ్గు చూపాలన్నారు. ఇదేవిధంగా …

Read More »

సంఘంలో ఖచ్చితంగా సభ్యులై ఉండాలి

  గాంధారి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న గొర్రెల యూనిట్ల పంపినీలో లబ్దిదారులు ఖచ్చితంగా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘంలో సభ్యులై ఉండాలని గాంధారి తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ అన్నారు. మంగళవారం మండలంలో మాత్‌సంగం గ్రామంలో లబ్దిదారుల ఎంపిక కొరకై నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల పథకం దరఖాస్తు ఫారాలు ఇవ్వడానికి ఖచ్చితంగా లబ్దిదారుడు స్వయంగా వచ్చి ఇవ్వాలన్నారు. స్థానికంగా ఉండకుండా వేరే ప్రాంతాల్లో ఉండే గొల్ల, కుర్మ సభ్యులు …

Read More »

మొక్కలు ఎండిపోకుండా చూడాలి

  గాంధారి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నర్సరీలో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా చూడాలని గాందారి జడ్పిటిసి తానాజీరావు అన్నారు. మంగళవారం గాందారి మండలంలోని ముదెల్లి చౌరస్తావద్దగల అటవీ శాఖ నర్సరీని ఆయన పరిశీలించారు. జూన్‌ నెలలో ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్దంగా ఉంచాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. నర్సరీలో మొక్కలు పచ్చగా అందంగా ఉన్నాయని వీటిని ఇలాగే కాపాడాలన్నారు. ఎప్పటికప్పుడు నీటిని అందించాలన్నారు. నర్సరీలో మొక్కలు సంరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ఆయన వెంట గాంధారి సర్పంచ్‌ …

Read More »

బుధవారం అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

  గాంధారి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గౌరారం గ్రామంలో బుధవారం డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ నిర్వహిస్తున్నట్టు గాంధారి మండల అంబేడ్కర్‌ యువజన సంఘం సభ్యులు సాయికుమార్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో విలేరులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్ళుగా గౌరారం గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని యువజన సంఘం సభ్యులు కోరుతున్నారన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. కార్యక్రమానికి గాయకుడు ఏపూరి సోమన్న హాజరుకానున్నారన్నారు. మండల దళిత …

Read More »

జాబ్‌కార్డులతో బీమా పథకం

  మోర్తాడ్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అందిస్తున్న జాబ్‌కార్డులతో పాటు కార్మికశాఖ కింద ఉపాధి హామీ కూలీలకు బీమా, ఇన్సురెన్సు సౌకర్యం కల్పిస్తుందని సర్పంచ్‌లు బుక్య అంజిబాయి, ఈర్ల లక్ష్మిలు అన్నారు. మంగళవారం మండలంలోని రామన్నపేట్‌, బట్టాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో శ్రమసంఘ ఉపాధి హామీ కూలీలకు నూతన జాబ్‌కార్డులు, మెడికల్‌ కిట్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో నిరంతరం పనులు చేసేవారికి శ్రమ సంఘం …

Read More »

గొర్రెల సంరక్షణకై మోబైల్‌ వాహనం

  మోర్తాడ్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం గొల్ల, కుర్మ సంఘ సభ్యులను అభివృద్ది పరిచేందుకు గొర్రెలు, మేకలు అందించడమే గాకుండా వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక వైద్య మొబైల్‌ వాహనాన్ని ఏర్పాటు చేసిందని తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ఎంపిడివో శ్రీనివాస్‌లు అన్నారు. మంగళవారం మోర్తాడ్‌ మండలంలోని దొన్కల్‌, ధర్మోరా, షెట్‌పల్లి గ్రామ పంచాయతీల కార్యాలయాల ఆవరణలో సర్పంచ్‌ల అధ్యక్షతన గొల్ల కుర్మ సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించారు. దొన్కల్‌లో 30 మంది, ధర్మోరాలో 16 మంది, షెట్పల్లిలో 16 మంది …

Read More »