Breaking News

Daily Archives: May 17, 2017

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి

  కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పెన్షనర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తనవంతు కృసి చేస్తామని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డితోపాటు ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 70 సంవత్సరాలకు పైబడిన రిటైర్డ్‌ ఉద్యోగికి పిఆర్‌సి 2015లో పేర్కొనబడి ఆమోదించిన క్వాంటం 15 శాతం సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరుచేయిస్తామన్నారు. పిఆర్‌సి బకాయిలను సైతం ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ …

Read More »

వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం

  కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌పిఆర్‌ పాఠశాలలో క్రీడాభారతి ఆద్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించారు. నిర్వాహకులు అంకుష్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. 18 సంవత్సరాల బాలబాలికలకు ప్రత్యేక క్రీడల్లో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. కబడ్డి, ఖోకో, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌తోపాటు ఇతర క్రీడల్లో శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడాభారతి సబ్యులు మహిపాల్‌,సతీష్‌, ప్రవీణ్‌, రవి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గొర్రెల పంపిణీ పథకాన్ని వినియోగించుకోవాలి

  కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని కుర్మ, గొల్ల, యాదవ కులస్తులు వినియోగించుకోవాలని కామారెడ్డి సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పశుసంవర్ధకశాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుర్మ, గొల్ల యాదవులు సహకార సంఘంగా ఏర్పడి సభ్యత్వం పొంది పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. యూనిట్‌ ధర రూ. లక్ష 25 వేలు ఉంటుందని, 20 గొర్రెలు, ఒక పోతును …

Read More »

రైతులను దగా చేస్తున్న తెరాస సర్కార్‌

  కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని కామారెడ్డి యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. బుధవారం కామారెడ్డి మార్కెట్‌యార్డులోని ధాన్యం పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతే రాజు అని చెప్పిన ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం గర్హణీయమన్నారు. తప్పుడు వాగ్దానాలు చేస్తు రైతులను నమ్మకద్రోహం చేస్తుందని, రైతు ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం …

Read More »

రైతు సమస్యలపై ఆర్డీవోకు వినతి

  కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కామారెడ్డి యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు బుధవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కొయల్‌కర్‌ కన్నయ్య మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వారంరోజుల్లో ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి చెందారని, అయినా ప్రభుత్వం స్పందించకపోవడం గర్హణీయమన్నారు. …

Read More »

తెరాస గ్రామ కమిటీ ఎన్నిక

  గాంధారి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గౌరారం గ్రామ తెరాస కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షునిగా అంజయ్య, ఉపాధ్యక్షులుగా వడ్లసాయిలు, రమేశ్‌, కార్యదర్శిగా గుండ్ల అంజయ్య, సంయుక్త కార్యదర్శిగా సిరిగాద పాపయ్య, కోశాధికారిగా దాన రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన తెరాస గ్రామ కమిటీ సభ్యులకు మండల పార్టీ అధ్యక్షుడు ముకుంద్‌రావు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారిని సన్మానించారు. తెరాస పార్టీని, ప్రభుత్వ పథకాలను గ్రామస్తాయిలో లబ్దిదారులకు అందేవిధంగా …

Read More »

లాటరీ ద్వారా లబ్దిదారుల ఎంపిక

  గాంధారి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గౌరారం గ్రామంలో బుధవారం లాటరీ ద్వారా గొర్రెల యూనిట్ల పంపిణీ లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో మొత్తం 30 దరఖాస్తులు గొల్ల కుర్మల నుంచి రాగా, వాటిలో 50 శాతం 15 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 30 మంది పేర్లను చీటిల్లో రాసి లాటరీ తీశారు. ఈయేడు 15 మందిని ఎంపికచేయగా, మిగతా …

Read More »

దీక్షకు సర్వం సిద్దం

  నందిపేట, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి, ఎస్సీలకు రిజర్వేషన్ల శాతం పెంచాలని డిమాండ్‌చేస్తు 18,19 తేదీల్లో నందిపేట మండల కేంద్రంలోని తెలంగాణ చౌక్‌ వద్ద తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారాం యాదవ్‌ దీక్ష నిర్వహించనున్నట్టు మండల పార్టీ అధ్యక్షుడు కచ్చకాయల రాజేశ్వర్‌ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దీక్ష కొరకు సర్వం సిద్దం చేశామని, గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డితో కలిసి రాజారాం యాదవ్‌ దీక్ష …

Read More »

గర్గుల్‌లో ఎలుగుబంటి…

  కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనావాసాల్లోకి ఎలుగుబంటి వచ్చింది… ప్రజలు గమనించి బెంబేలెత్తిపోయారు…. కామరెడ్డి మండలం గర్గుల్‌గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఎలుగుబంటి కనిపించింది. గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు ఎఫ్‌డివో రేఖాబాను, ఎఫ్‌ఆర్‌వోలు విద్యాసాగర్‌, అంబర్‌సింగ్‌ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు గాలింపు చేపట్టినా పలితం లేకుండా పోయింది. దీంతో మెదక్‌ నుంచి అనిమల్‌ రిస్యు టీం ను రప్పించి ఎట్టకేలకు ఎలుగును …

Read More »

సింగిల్‌ డాక్టర్‌ ప్రభుత్వ ఆసుపత్రి

  నందిపేట, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోగల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సింగిల్‌ డాక్టర్‌తో నెట్టుకొస్తుంది. రాత్రి, పగలు విడతలవారిగా ఇద్దరు డాక్టర్లతో 24 గంటలు వైద్య సేవలందించాల్సి ఉంది. కానీ కొన్ని సంవత్సరాలుగా ఒక్క డాక్టరే సేవలందిస్తున్నాడు. డాక్టరుతో పాటు సిబ్బంది కొరత ఉండడం, డాక్టర్‌ శాఖాపరమైన సమావేశాలకు వెళ్లినపుడు రోగులను పరీక్షించే నాథుడే కరువయ్యాడు. ఇక్కడ రోజుకు సుమారు 70 నుంచి 80 మంది ఔట్‌పేషెంట్‌ రోగులు పరీక్షలు చేయించుకొని మందులు …

Read More »