Daily Archives: May 18, 2017

గురుకుల టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ రాతపరీక్షపై అవగాహన

  నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌, న్యూ ఢిల్లీ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఈ లైబ్రరి ప్రోగ్రామ్‌ అమలు కార్యక్రమంలో భాగంగా లైబ్రరికి వచ్చిన పాఠకులకు గురుకుల టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ పై అవగాహన కల్పించారు. స్తానిక ఐ 5కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు రవివర్మ గ్రంథాలయ పాఠకులకు గురుకుల టీచర్స్‌ నియామక పరీక్షలు రాసే విధానం వివరించారు. రిక్రూట్‌మెంట్‌లో ఇచ్చిన సిలబస్‌ పూర్తిగా చదివి అవగాహన ఏర్పాటు చేసుకోవాలని, అలాగే జనరల్‌ …

Read More »

21న ప్రతిభా పురస్కారాలు

  కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో ఈనెల 21వ తేదీన ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్టు జాగృతి జిల్లా కన్వీనర్‌ అనంతరాములు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత శ్రేణి ర్యాంకులు సాధించిన 10వ తరగతి విద్యార్థిని, విద్యార్తులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ చేతుల మీదుగా నగదు అవార్డుతో పాటు మెరిట్‌దృవీకరణ పత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఆయా పాఠశాలల ప్రధానోపాద్యాయులను అభినందిస్తూ జ్ఞాపికలు బహుకరించనున్నట్టు తెలిపారు. 21న ఉదయం 11 గంటలకు …

Read More »

గ్రామసభల్లో లాటరీ ద్వారా లబ్దిదారుల ఎంపిక

  గాంధారి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొర్రెల యూనిట్ల పంపిణీ పథకంలో లబ్దిదారులను గ్రామసభలు నిర్వహించి లాటరీ ద్వారాఎంపిక చేస్తున్నారు. ఈ సందర్భంగా గాంధారి మండలంలోని సీతాయిపల్లి, మేడిపల్లి గ్రామాల లబ్దిదారులను గురువారం ఎంపిక చేశారు. సీతాయిపల్లిలో మొత్తం 57 దరఖాస్తులు రాగా ఈసంవత్సరం 29 మందిని లాటరీ నిర్వహించి ఎంపిక చేశారు. మిగతా 28 మందికి వచ్చే సంవత్సరం గొర్రెల యూనిట్లను అందజేయనున్నారు. అలాగే మేడిపల్లి 11 మందికి ఆరుగురిని ఈసంవత్సరానికి, 5 మందిని వచ్చేసంవత్సరానికి ఎంపిక …

Read More »

పారిశుద్య నిర్వహణపై ఆర్డీవోకు ఫిర్యాదు

  కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో పారిశుద్య నిర్వహణ వ్యవస్థ పనితీరు సరిగా లేదని, దాన్ని మెరుగుపరచాలని గురువారం 24వ వార్డు వాసులు మునిసిపల్‌ ప్రత్యేకాధికారి ఆర్డీవో శ్రీనివాస్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వందల సంఖ్యలో పారిశుద్య కార్మికులున్నా వార్డులో చెత్త ఎత్తడం లేదని పేర్కొన్నారు. మురికి కాలువలను తొలగించకపోవడంతో మురికినీరు ఆవాసాల మధ్యలోకి చేరుతుందని చెప్పారు. పలితంగా దోమల బెడద తీవ్రంగా ఉందని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన …

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

  గాంధారి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గౌరారం గ్రామంలో బుధవారం రాత్రి అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ గాయకుడు ఏపూరి సోమన్నతో పాటు ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి నల్లమడుగు సురేందర్‌, అంబేడ్కర్‌సంఘం జిల్లా కో కన్వీనర్‌ సాయికుమార్‌లు హాజరయ్యారు. ఈసందర్బంగా గ్రామంలో సాయంత్రం నుండి రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారతరత్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ గురించి వక్తలు ప్రసంగించారు. దళితుల అభ్యున్నతికి, అభివృద్ది కొరకు అంబేడ్కర్‌ అహర్నిశలు కృసి …

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  గాంధారి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం మాదవపల్లి గ్రామంలో గురువారం సిసిరోడ్డు పనులను జడ్పిటిసి తానాజీరావు ప్రారంభించారు. జిల్లా పరిషత్‌నుంచి రెండు లక్షల రూపాయలతో గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈపనులను త్వరితగతిన పూర్తిచేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదార్లకు సూచించారు. మదన్‌పల్లి గ్రామంలో ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని గ్రామస్తులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పిఆర్‌ ఎ.ఇ. గౌసోద్దీన్‌, గ్రామస్తులు శంకర్‌రావు, మాదవ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మేదరి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మేదరి సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నట్టు సంఘం ప్రతినిదులు తెలిపారు. జిల్లా కమిటీ అధ్యక్షుడుగా ఆర్నె కిషన్‌, ప్రధాన కార్యదర్శిగా బాల్‌రాజు, కోశాదికారిగా రాజేందర్‌, ప్రచార కార్యదర్శిగా శ్రీనివాస్‌, ఉద్యోగుల సంఘం కన్వీనర్‌గా గంగాదర్‌, ముఖ్య సలహాదారులుగా పుట్ట మల్లికార్జున్‌, యువజన సంఘం గౌరవాధ్యక్షునిగా కోన శ్రీనివాస్‌, అధ్యక్షునిగా పిల్లి నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా రాకేశ్‌, ప్రచార కార్యదర్శిగా నరేశ్‌, కోశాధికారిగా లింగం, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా …

Read More »

గొర్రెల పంపిణీకి 578 లబ్దిదారుల ఎంపిక

  నందిపేట, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని గొర్రె కాపరుల కొరకు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆయా గ్రామాల్లో ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించినట్టు తహసీల్దార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా సొసైటీల ననుసరించి, సొసైటీ వారిగా లబ్దిదారులను ఎంపికచేసినట్టు ఆయన అన్నారు. తహసీల్దార్‌, ఎంపిడివో, వెటర్నరీ వైద్యులు కలిసి లబ్దిదారులను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. మండలం మొత్తానికిగాను 1163 మంది ఈ పథకానికి దరకాస్తు చేసుకోగా ప్రభుత్వ ఉత్తర్వుల …

Read More »

త్రిపుల్‌ ఐటిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో బిటెక్‌ డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విశ్వవిద్యాలయం ప్రతినిధులు తెలిపారు. ఆరుసంవత్సరాల పాటు సమీకృత బిటెక్‌ డిగ్రీ విద్యాకార్యక్రమం ఉంటుందన్నారు. ఎస్‌ఎస్‌సి, తత్సమాన పరీక్ష 2017లో రెగ్యులర్‌ విద్యార్థులుగా ప్రథమ ప్రయత్నంలో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 31.12.2017 నాటికి 18 సంవత్సరాలు మించకూడదని, ఎస్సీ, ఎస్టీ అబ్యర్థులకు సడలింపు ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా …

Read More »

రిజర్వేషన్ల శాతం పెంచాల్సిందే…

  తెదేపా దీక్షలో నాయకుల డిమాండ్‌ నందిపేట, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెనకబడిన తరగతుల అభివృద్ధి కొరకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌లు పెంచాలని కోరుతూ తెదేపా ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారాం యాదవ్‌ గురువారం నందిపేటలోని తెలంగాణ చౌక్‌ వద్ద రెండురోజుల దీక్ష ప్రారంభించారు. ముందుగా నంది విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం డిటిపి జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, రాజారాం యాదవ్‌కు పూలమాలవేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. జనాభా దామాషా ప్రకారం బిసిలకు 52 శాతం, ఎస్సీలకు …

Read More »