Breaking News

ఘనంగా అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

 

గాంధారి, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గౌరారం గ్రామంలో బుధవారం రాత్రి అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ గాయకుడు ఏపూరి సోమన్నతో పాటు ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి నల్లమడుగు సురేందర్‌, అంబేడ్కర్‌సంఘం జిల్లా కో కన్వీనర్‌ సాయికుమార్‌లు హాజరయ్యారు. ఈసందర్బంగా గ్రామంలో సాయంత్రం నుండి రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారతరత్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ గురించి వక్తలు ప్రసంగించారు. దళితుల అభ్యున్నతికి, అభివృద్ది కొరకు అంబేడ్కర్‌ అహర్నిశలు కృసి చేసేవారన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్‌ దళితులను మోసం చేస్తున్నారని సోమన్న, సురేందర్‌లు విమర్శించారు. అనంతరం ఏపూరి సోమన్న ఉద్యమ గీతాలు పాడి వినిపించారు. కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్‌, టిడిపి నాయకులు, దళితులు, గ్రామస్తులు, అంబేడ్కర్‌ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *