21న ప్రతిభా పురస్కారాలు

 

కామారెడ్డి, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో ఈనెల 21వ తేదీన ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్టు జాగృతి జిల్లా కన్వీనర్‌ అనంతరాములు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత శ్రేణి ర్యాంకులు సాధించిన 10వ తరగతి విద్యార్థిని, విద్యార్తులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ చేతుల మీదుగా నగదు అవార్డుతో పాటు మెరిట్‌దృవీకరణ పత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఆయా పాఠశాలల ప్రధానోపాద్యాయులను అభినందిస్తూ జ్ఞాపికలు బహుకరించనున్నట్టు తెలిపారు. 21న ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని కర్షక్‌ బిఇడి కళాశాలలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.

Check Also

చిత్రపురి పిల్మ్‌ఫెస్టివల్‌ అవార్డు గ్రహీతకు సన్మానం

  కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిత్రపురి పిల్మ్‌ఫెస్టివల్‌ 2017లో రాణించిన నరేశ్‌ను బుధవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *