Breaking News

గురుకుల టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ రాతపరీక్షపై అవగాహన

 

నిజామాబాద్‌, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌, న్యూ ఢిల్లీ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఈ లైబ్రరి ప్రోగ్రామ్‌ అమలు కార్యక్రమంలో భాగంగా లైబ్రరికి వచ్చిన పాఠకులకు గురుకుల టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ పై అవగాహన కల్పించారు. స్తానిక ఐ 5కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు రవివర్మ గ్రంథాలయ పాఠకులకు గురుకుల టీచర్స్‌ నియామక పరీక్షలు రాసే విధానం వివరించారు. రిక్రూట్‌మెంట్‌లో ఇచ్చిన సిలబస్‌ పూర్తిగా చదివి అవగాహన ఏర్పాటు చేసుకోవాలని, అలాగే జనరల్‌ విషయాలపై నేషనల్‌, ఇంటర్‌ నేషనల్‌ స్థాయిలోజరిగే విషయాలపై దినపత్రికలను చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తులతో మాట్లాడడం, వినడం ద్వారా విజ్ఞానాన్ని పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *