పారిశుద్య నిర్వహణపై ఆర్డీవోకు ఫిర్యాదు

 

కామారెడ్డి, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో పారిశుద్య నిర్వహణ వ్యవస్థ పనితీరు సరిగా లేదని, దాన్ని మెరుగుపరచాలని గురువారం 24వ వార్డు వాసులు మునిసిపల్‌ ప్రత్యేకాధికారి ఆర్డీవో శ్రీనివాస్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వందల సంఖ్యలో పారిశుద్య కార్మికులున్నా వార్డులో చెత్త ఎత్తడం లేదని పేర్కొన్నారు. మురికి కాలువలను తొలగించకపోవడంతో మురికినీరు ఆవాసాల మధ్యలోకి చేరుతుందని చెప్పారు. పలితంగా దోమల బెడద తీవ్రంగా ఉందని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు చెత్త ఎత్తేలా సిబ్బందిని ఆదేశించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ అంజద్‌, వార్డు వాసులు శోభన్‌, జనార్ధన్‌, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *