గ్రామసభల్లో లాటరీ ద్వారా లబ్దిదారుల ఎంపిక

 

గాంధారి, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొర్రెల యూనిట్ల పంపిణీ పథకంలో లబ్దిదారులను గ్రామసభలు నిర్వహించి లాటరీ ద్వారాఎంపిక చేస్తున్నారు. ఈ సందర్భంగా గాంధారి మండలంలోని సీతాయిపల్లి, మేడిపల్లి గ్రామాల లబ్దిదారులను గురువారం ఎంపిక చేశారు. సీతాయిపల్లిలో మొత్తం 57 దరఖాస్తులు రాగా ఈసంవత్సరం 29 మందిని లాటరీ నిర్వహించి ఎంపిక చేశారు. మిగతా 28 మందికి వచ్చే సంవత్సరం గొర్రెల యూనిట్లను అందజేయనున్నారు. అలాగే మేడిపల్లి 11 మందికి ఆరుగురిని ఈసంవత్సరానికి, 5 మందిని వచ్చేసంవత్సరానికి ఎంపిక చేశారు. లాటరీ ద్వారా ఎంపికైన గొల్ల, కుర్మ లబ్దిదారులకు జూన్‌నెలలో గొర్రెల యూనిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. కార్యక్రమంలో ఎంపిటిసి అంజద్‌కాన్‌, ఎండివో సాయాగౌడ్‌, పశువైద్యాధికారి రవికిరణ్‌, నయాబ్‌ తహసీల్దార్‌ అలెగ్జాండర్‌, యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

చిత్రపురి పిల్మ్‌ఫెస్టివల్‌ అవార్డు గ్రహీతకు సన్మానం

  కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిత్రపురి పిల్మ్‌ఫెస్టివల్‌ 2017లో రాణించిన నరేశ్‌ను బుధవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *