Breaking News

తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

 

కామారెడ్డి, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వీర యోధుల స్ఫూర్తిగా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలందరు సన్నద్దం కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి, ఎమ్మెల్యేలో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిదులు నడ్పి నర్సయ్య, ఓరగంటి స్వామి, నర్సోల్ల గంగాధర్‌, కిషన్‌, ఆశయ్య, శ్రీనివాస్‌, యువజన సంఘం ప్రతినిదులు మహేశ్‌, ఓరుగంటి మహేశ్‌, ఎర్రవటి శ్రీనివాస్‌, ప్రవీణ్‌, చిక్కలపల్లి రాజు, అంకరాజు, బాల గంగాధర్‌, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *