గొల్ల కుర్మ యాదవుల లబ్దిదారుల ఎంపిక

 

బీర్కూర్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొల్ల కుర్మ యాదవులకు గొర్రెలు, మేకలు పంపిణీ కార్యక్రమం కోసం బీర్కూర్‌ మండలంలో లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మీర్జాపూర్‌లో 28 మంది లబ్దిదారులను, అంకోల్‌లో 57 మందిని, మైలారంలో 52 మందిని ఎంపిక చేసినట్టు ఏఎంసి చైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ తెలిపారు. లబ్దిదారులు 25 శాతం డబ్బు చెల్లించి సబ్సిడీ పొందాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, తహసీల్దార్‌, ఎంపిడివో, పశు వైద్యులు, యాదవులు పాల్గొన్నారు.

Check Also

చిత్రపురి పిల్మ్‌ఫెస్టివల్‌ అవార్డు గ్రహీతకు సన్మానం

  కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిత్రపురి పిల్మ్‌ఫెస్టివల్‌ 2017లో రాణించిన నరేశ్‌ను బుధవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *