టాటా టిగర్‌ కార్‌ను ప్రారంభించిన మాజీ న్యాయమూర్తి

 

కామారెడ్డి, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర టాటా మోటార్స్‌ ఆధ్వర్యంలో మార్కెట్‌లోకి నూతనంగా వచ్చిన టాటా టిగర్‌ కార్‌ను మాజీ న్యాయమూర్తి సలీం ఆవిష్కరించారు. వినియోగదారులకు అతిచౌక ధరల్లో టాటా కంపెనీ వారు కార్లను మార్కెట్లోకి తెస్తుందన్నారు. ఈమేరకు టాటా టిగర్‌ పెట్రోల్‌ కారు 20 కి.మీ. లీటరుకు మైలేజీ ఇస్తుందని, ధర రూ.5.7 లక్షలు, అదేవిధంగా డిజిల్‌ కారు 23 కి.మీ. లీటరుకు మైలేజీ, ధర రూ.6.83 లక్షలతో అందరికి అందుబాటులోకి తేవాలని, సామాన్యులు సైతం కారు నడిపేలా టాటా కంపెనీ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతుందని టెరిటరి సేల్స్‌మేనేజర్‌ మంథని జానీ అన్నారు. కార్యక్రమంలో మేనేజర్‌ పార్థసారధి, సిబ్బంది తదితరులున్నారు.

Check Also

చిత్రపురి పిల్మ్‌ఫెస్టివల్‌ అవార్డు గ్రహీతకు సన్మానం

  కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిత్రపురి పిల్మ్‌ఫెస్టివల్‌ 2017లో రాణించిన నరేశ్‌ను బుధవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *