Breaking News

బిజెపిలో చేరిన హాజీపూర్‌ యువకులు

 

బీర్కూర్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధాన మోడి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో పార్టీ చేస్తున్న అభివృద్ది పనులకు, జాతీయభావాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున యువత భారతీయ జనతా పార్టీలో చేరుతుందని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని హాజీపూర్‌ గ్రామానికి చెందిన పలువురు యువకులు యువ నాయకులు రాము ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా యెండల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోడి అభివృద్దిని మరింత బలోపేతం చేసేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో రాము, మహేశ్‌, మైశన్న, రాజు, శ్రీరాములు, సాయిలు, లక్ష్మణ్‌, శ్రీకాంత్‌ ఉన్నారు.

Check Also

గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

  నందిపేట, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని కౌల్‌పూర్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *