Breaking News

దొన్కల్‌లో ఉపాధి కూలీలకు జాబ్‌కార్డులు పంపిణీ

 

మోర్తాడ్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం జాబ్‌కార్డులతో పాటు మెడికల్‌ కిట్లను, తాటిపత్రాలను అందిస్తుందని ఎంపిపి కల్లడ చిన్నయ్య, సర్పంచ్‌ సత్తమ్మలు అన్నారు. శుక్రవారం మండలంలోని దొన్కల్‌ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వం అందిస్తున్న జాబ్‌కార్డులను, మెడికల్‌ కిట్లను పంపినీ చేశారు. కూలీలు పనిచేసే చోట భోజనం చేసేందుకు తాటిపత్రాలు ఉపయోగించుకోవాలని, పనులు చేసే సమయంలో దెబ్బలు తగిలితే ప్రథమ చికిత్స కోసం మెడికల్‌ కిట్‌ వెంట ఉంచుకోవాలని సూచించారు. జాబ్‌ కార్డు పొందిన ప్రతి ఒక్కరికి కార్మికశాఖ పథకం కింద ఇన్సురెన్సు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు కల్లడ ఏలియా, కార్యదర్శి ఎం.డి.ఖాన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కృస్ణ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *