Breaking News

పింఛన్‌ లబ్దిదారుల జాబితా ఏర్పాటు

 

మోర్తాడ్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెండో విడత దరఖాస్తు చేసుకున్న ఒంటరి మహిళ, బీడీ కార్మికుల జీవన భృతి దరఖాస్తులను పరిశీలించడం జరిగిందని లబ్దిదారుల జాబితాను అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేస్తున్నట్టు తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ తెలిపారు. రెండోవిడతలో ప్రభుత్వం అందిస్తున్న ఒంటరి మహిళ, బీడీ కార్మికుల దరఖాస్తులను పరిశీలిన పూర్తయిందని అన్ని గ్రామ పంచాయతీల్లో జాబితాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఏమైనా పొరపాట్లు ఉంటే అధికారుల దృస్టికి తీసుకురావాలన్నారు. ఒంటరి మహిళ దరఖాస్తు గడువు ఈనెల 21 వరకు పొడిగించడం జరిగిందని, వాటిని కూడా పరిశీలించి జాబితాలో రూపొందిస్తామని పేర్కొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *