Breaking News

గ్రామాల అభివృద్దే ధ్యేయంగా ఎమ్మెల్యే కృషి

 

మోర్తాడ్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రబుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలో అన్ని గ్రామాల అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్నారని సర్పంచ్‌ నాగం పోశన్న, తెరాస మండల పార్టీ అద్యక్షుడు కల్లడ ఏలియా, ఎంపిటిసి డాక్టర్‌ జయవీర్‌లు అన్నారు. శుక్రవారం మండలంలోని ఒడ్యాట్‌ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణపనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు 43 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరుచేశారని, ఒక్కోగ్రామ పంచాయతీ నిర్మాణానికి 13 లక్షల చొప్పున నిదులు మంజూరు చేశారని వారన్నారు. నూతన భవనాలు నిర్మించడం వల్ల గ్రామాలకు నూతన కళ వచ్చిందన్నారు. గ్రామాల్లో అన్ని వర్గాల అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. ప్రజల సహకారంతోనే ఎమ్మెల్యే ప్రజా సేవకుడుగా అభివృద్ది పరుస్తున్నారని, ప్రజలకు తెరాసకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, నాయకులు మహిపాల్‌, చిన్న రాజేశ్వర్‌, ఏనుగు రాజేశ్వర్‌, దేవన్న, గంగన్న, కార్యదర్శి తిరుపతిరెడ్డి, విఆర్వో జ్యోతి, కారోబార్‌ మహిపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎంబిసి వర్గాల సమస్యల పరిష్కారానికి ఉద్యమం

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంబిసి వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *