Breaking News

వర్గీకరణ జరిగేవరకు పోరాటం

 

కామారెడ్డి, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్గీకరణ జరిగే వరకు మాదిగ ఉపకులాలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరముందని తెలంగాణ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేణుకుంట నాంపల్లి అన్నారు. ఈ మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం పట్టణంలో జిల్లా అధ్యక్షులు తుకారం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాంపల్లి మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కావాలని సమాజంలో ఆవిధంగా మార్పు రావాలని జనాభా ప్రాతిపదికన పలాలు అందాలని డాక్టర్‌ అంబేడ్కర్‌ కోరుకున్నారన్నారు. కానీ కొందరు స్వార్థపరుల వల్ల ఎస్సీ వర్గీకరణ జరగడం లేదని, వారునిజమైన అంబేడ్కర్‌ వారసులు కాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1996 జస్టిస్‌ రాంచందర్‌రాజ్‌ కమీషన్‌ వేసినపుడు వర్గీకరణ జరగాలని నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. గత కేంద్ర ప్రభుత్వం 2007లో జస్టిస్‌ ఉషా మెహర్‌ కమీషన్‌ ఏర్పాటుచేసిందన్నారు. ఆ కమీషన్‌ రాష్ట్ర మంతా పర్యటించి నివేదికను కేంద్రానికి ఇస్తు 341 ఆర్టికల్‌ సవరణ చేసి రాష్ట్రాలకు అధికారం ఇవ్వచ్చని సూచన చేసిందనిగుర్తుచేశారు. కార్యక్రమంలో సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

పూరి వర్గాన్నే టార్గెట్ చేశారా?

హైదరాబాద్: సినిమా ఇండ్రస్టీ అంటేనే ఓ మాయా జగత్తు. సింగిల్ నైట్లో స్టార్స్ అయిపోవచ్చు. సింగిల్ డేలో రోడ్డుపైకి వచ్చేయచ్చు. ఒక్క …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *