గొల్ల కుర్మల అభివృద్దే ధ్యేయం

 

మోర్తాడ్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొల్ల కుర్మలు ఆర్థికంగా రాణించేందుకు తెరాస ప్రభుత్వం గొర్రెల పెంపకం పథకాన్ని అమలు చేస్తుందని మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, సర్పంచ్‌లు తుమ్మల మారుత, లోలం లావణ్య, బుక్య రాణిబాయి, తహసీల్దార్‌ ముల్తాజుద్దీన్‌లు అన్నారు. శుక్రవారం మండలంలోని తాళ్లరాంపూర్‌, తడపాకల్‌, బట్టాపూర్‌ గ్రామ పంచాయతీల కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ల అధ్యక్షతన ఆయాగ్రామాల గొల్ల, కుర్మ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు లాటరీ పద్దతిలో తాళ్లరాంపూర్‌లో – 26 మంది లబ్దిదారులను, తడపాకల్‌లో 37 మందిని, బట్టాపూర్‌లో 30 మందిని ఎంపిక చేశారు. మొదటి విడత ఎంపికైన లబ్దిదారులు 25 శాతం కంట్రిబ్యూషన్‌ చెల్లించి సబ్సిడీకింద ప్రభుత్వం అందించే గొర్రెలు, మేకలు పొందాలన్నారు. గొర్రెల సంరక్షణకై అన్ని గ్రామాల్లో పశు వైద్యులను నియమిస్తుందని, అదేవిధంగా వాటికవసరమగు గడ్డి పెంపకం కోసం విత్తనాలు, ఎరువుల అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసిలు సరస్వతి, జక్కం లక్ష్మి, విఆర్వోలు రవి, రమేశ్‌, గొల్ల, కుర్మ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *