Breaking News

కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి

 

– ఆర్‌ఎస్‌పి జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు

కామారెడ్డి, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో సర్వే నెంబరు 158లో గల 12 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన కొందరు పెద్దలు అధికారులతో కుమ్ముక్కై ఆక్రమించుకున్నారని ఆర్‌ఎస్‌పి జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఇప్పటికీ కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని, అధికారులకు తెలిసికూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముత్యంపేటలో కబ్జాకు గురైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని లేకపోతే విప్లవపార్టీగా తామే ఎర్రజెండాలు పాతి పేదలకు పంచుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సత్యం, జబ్బార్‌, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *