Breaking News

హరితహారం లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి

 

మోర్తాడ్‌, మే 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న మూడోవిడత హరితహారం పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని మోర్తాడ్‌ ఎంపిడివో శ్రీనివాస్‌, ఎంపిపి కల్లడ చిన్నయ్య, తహసీల్దార్‌లు సూర్యప్రకాశ్‌, ముల్తాజుద్దీన్‌లు, ప్రోగ్రాం అధికారి నర్సయ్యలు అన్నారు. సోమవారం ఇజిఎస్‌ కార్యాలయంలో మూడోవిడత హరితహారం పథకంపై జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వివిధ శాకల అధికారులతో సమీక్షించారు. రెండు మండలాల్లో 7 లక్షల 20 వేల మొక్కలను ప్రభుత్వం లక్ష్యంపెట్టిందని, పకడ్బందీ ప్రణాళికతో లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. రెండో విడతలో లక్ష్యం మేరకు మోర్తాడ్‌ మండలంలో 5వ స్తానంలో నిలిచిందన్నారు. అదేవిధంగా మూడో విడత హరితహారాన్ని పకడ్బందీగా అమలు చేసి మొదటిస్థానంలో నిలపాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలు నాటించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, కార్యదర్శులు, విఆర్వోలు, ఐకెపి అదికారులు పాల్గొన్నారు.

Check Also

పందులను నివారించ లేరా?

నందిపేట్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో ఏముంది ..ఒకవైపు అపరిశుభ్ర వాతావరణం.. మరోవైపు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *