Breaking News

Daily Archives: June 1, 2017

బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీనదయాళ్‌ ఉపాధ్యాయ కార్యవిస్తరణలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని 224, 226 బూత్‌ కేంద్రాల్లో గురువారం రెండోరోజు ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించారు. బూత్‌ కేంద్రంలో బిజెపి నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంటింటికిబిజెపి, వాడవాడకు నరేంద్రమోడి అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్దే దేశాభివృద్ది నినాదంతో ప్రజల్లోకి వెలుతున్నట్టు తెలిపారు. ప్రధాని మోడి చేసిన మంచి పనులను వివరిస్తు కెసిఆర్‌ వైఫల్యాలను సైతం ప్రజల్లోకి …

Read More »

అదుపుతప్పి బస్సు బోల్తా – 29 మందికి గాయాలు

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిద్దిపేట నుంచి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసి బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న 29 మందికి గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మాచారెడ్డి మండలం భవానిపేట వద్ద ఆర్టీసి బస్సు గేరుబాక్సు ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన నెమ్మదిగా బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలుకాగా 29 మంది ప్రయాణీకులకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామరెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Read More »

రిలే దీక్షలను జయప్రదం చేయాలి

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ రంగ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఈనెల 2వ తేదీ నుంచి నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని బిసిడబ్ల్యుయు జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్‌ చేశారు. గురువారం కామారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ రంగాల కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ స్కీం అమలుకు జారీచేసిన డ్రాప్ట్‌ లేబర్‌ కోడ్‌ బిల్లుకు సంబంధించి శాశ్వత జివో అమలు చేయాలని పేర్కొన్నారు.స్థానిక నిర్మాణ కార్మికులకు …

Read More »

మహిళలకు ముగ్గుల పోటీలు

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళలు, బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ఆవిర్భావ వేడుకల్లో బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు చంద్రమోహన్‌, గంగాదర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అమరవీరుల స్థూపం పనులు పరిశీలించిన మంత్రి పోచారం

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం పనులను గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఆయనతోపాటు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌, ఎల్లారెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యేలు రవిందర్‌రెడ్డి, హన్మంత్‌షిండేలు ఉన్నారు. వారితో కలిసి స్థూపం పనులు పర్యవేక్షించిన మంత్రి మాట్లాడారు. స్థూపం పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. …

Read More »

అంత్యోదయ వర్గాల అభివృద్దే మోడి లక్ష్యం

  గాంధారి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోని అంత్యోదయ వర్గాల అభివృద్దే ప్రధానమంత్రి నరేంద్రమోడి లక్ష్యమని మాజీ మంత్రి, బిజెపి రాష్ట్ర నాయకులు నేరెళ్ల ఆంజనేయులు అన్నారు. గురువారం గాంధారి మండలంలో కొనసాగుతున్న ఇంటింటికి మోడి పథకాల ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దీన్‌దయాళ్‌ ఉపాద్యాయ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం ఇంటింటికి నిర్వహిస్తున్నామన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్తాయిలో వుంచడానికి మోడి కృషి …

Read More »

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం టేక్రియాల్‌ వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సిఎం కెసిఆర్‌ బావమరిది భార్య స్వరూప ప్రయాణిస్తున్న వాహనం లారీకి ఢీకొంది. కారు లారీని ఓవర్‌ టేక్‌ చేయబోతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో స్వరూపకు గాయాలు కాగా వెంటనే కామారెడ్డిలోని ఓప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు …

Read More »

గొర్రెల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలి

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొర్రెల పంపిణీ పథకాన్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణసూచించారు. గురువారం కలెక్టరేట్‌ కార్యాలయంలో గొర్రెల పంపిణీపథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో గొర్రెల పంపిణీ పథకం, సొసైటీల రిజిస్ట్రేషన్‌పై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా ఎంపిక చేసిన జాబితాను కంప్యూటర్లో ఎంట్రీ చేసి జిల్లా కమిటీ అనుమతి పొందాలని ఇందుకు సంబందించిన ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. గొర్రెల లభ్యతపై ఆరాతీశారు. బృందాల …

Read More »

ప్రజాగర్జన సభకు తరలిన కాంగ్రెస్‌ నాయకులు

  బీర్కూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం సంగారెడ్డిలో నిర్వహించనున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజా గర్జన సభకు బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల కాంగ్రెస్‌ నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ హైమద్‌ మాట్లాడుతూ తెరాస పాలన ఆగమ్యగోచరంగా మారిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదని పేర్కొన్నారు. ప్రజా గర్జన కార్యక్రమానికి ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టిపిసిసి అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ హాజరవుతున్నారని, మండలం నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు బయల్దేరి …

Read More »

సంగారెడ్డికి తరలిన కాంగ్రెస్‌ నాయకులు

  గాంధారి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌పార్టీ సంగారెడ్డిలో నిర్వహించే ప్రజాగర్జన సబకు గాంధారి మండల కాంగ్రెస్‌ నాయకులు గురువారం తరలివెళ్లారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు బయల్దేరారు. మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాగర్జన సభలో ప్రసంగించనున్నారు. మహాసభకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు. సంగారెడ్డికి …

Read More »