Breaking News

Daily Archives: June 2, 2017

ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకోవాలి

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకోవాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఎల్‌.నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. సివిల్‌ సప్లయ్‌ హమాలీ యూనియన్లు నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు శుక్రవారం నాటికి రెండోరోజుకు చేరుకున్నాయి. శిబిరాన్నిసందర్శించిన నర్సింహారెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకాన్ని కొనసాగించాలని, సబ్సిడీలు ఎత్తివేయొద్దని, వినియోగదారులకు రేషన్‌ దుకాణాల ద్వారానే జాతీయ ప్రజాపంపిణీ పథకాన్ని అందజేయాలని డిమాండ్‌ చేశారు. హమాలీ కార్మికులకు ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, సొంత …

Read More »

విశ్వబ్రాహ్మణ సంఘం అడ్‌హక్‌ కమిటీ ఎన్నిక

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అడ్‌హక్‌ కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్‌గా బ్రహ్మం, కో కన్వీనర్‌గా ముకుందం, చంద్రమౌళి, శ్రీనివాస్‌, యాదగిరి, వెంకటస్వామి, శేషుకుమార్‌, చంద్రశేఖర్‌, సభ్యులుగా మారుతి, ముకుందం, గంగాధర్‌, వెంకటేశంలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ఎన్నికల నేపథ్యంలో అడ్‌హక్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కమిటీని త్వరలో ఎన్నుకుంటామని తెలిపారు.

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం పలువురు రక్తదానం చేశారు. మాజీ కౌన్సిలర్‌ కాంశెట్టి, కెవిఎస్‌ మెంబరు బుచ్చయ్యతోపాటు పలువురు అధికారులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరు రక్తదానం చేయాలని, ప్రతి ఒక్కరి రక్తదానం ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తిని కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపి బి.బి.పాటిల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి, …

Read More »

ముస్లిం-మైనారీటీకమిటీ నందిపేట అధ్యక్షుని ఏకపక్ష నిర్ణయాలపై ఫిర్యాదు

  నందిపేట, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట ముస్లిం మైనారిటి కమిటీ అధ్యక్షుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ముస్లింల మధ్య గొడవకు కారకుడు అవుతున్న మధరుద్దీన్‌పై చట్టపర చర్యలు తీసుకోవాలని శుక్రవారం నందిపేట ముస్లింలు పోలీసుస్టేషన్‌కు వెళ్లి అధ్యక్షునిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ జాన్‌రెడ్డిని కోరారు. వివరాల్లోకి వెళితే… నందిపేట గ్రామంలో మూడు మజీద్‌లువున్నాయి. అందులో పురాతన 50 సంవత్సరాల చరిత్రగల జామేమజీద్‌ ఆధ్వర్యంలో ఖబ్రస్తాన్‌, ఈద్గా, కమర్షియల్‌ ఖోకల ద్వారా ఆదాయం వుంది. గత నెల ఏప్రిల్‌లో …

Read More »

రిలే దీక్షలు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికుల రిలే దీక్షలు శుక్రవారం ప్రారంభించారు. సిఐటియు ఆద్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు అమలు చేయాలని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని, నిర్మాణ, వస్తు ధరలను తగ్గించి స్థిరీకరించాలని డిమాండ్‌ చేశారు. 298 జివోను రద్దుచేయాలని, కార్మికులకు వెల్పేర్‌ బోర్డు నుంచి 3 వేల …

Read More »

అమరవీరుల స్థూపం వద్ద నివాళులు

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులు అర్పించారు. అవతరణ ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణ శివారులోని హౌజింగ్‌ బోర్డు వద్ద అమరుల స్థూపాన్ని నిర్మించారు. స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అమరులకు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కోసం అమరవీరులు చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. వారి పోరాటాల ఫలితంగానే తెలంగాణ సిద్దించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ …

Read More »

ఉత్తమ పురస్కారాల అందజేత

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులకు రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా స్తాయిలో ఉత్తమ పురస్కారాలను అందజేశారు. అర్చక రంగంలో సిద్దిగిరి శర్మ, బేతల్‌ స్వచ్చంద సంస్థ, గ్రామ పంచాయతీ బిచ్కుంద మండలం పెద్దదేవాడ, రచయితగా అబ్దుల్‌ గఫూర్‌, కవి సయ్యద్‌ తాహెర్‌, పారిశ్రామిక వేత్తగా కంచర్ల లింగం, అంగన్‌వాడి కార్యకర్తగా పి.సుజాత, క్రీడాకారిణి మమత, ఉద్యోగి నిర్మల, పాత్రికేయులు షేక్‌ మోహినుద్దీన్‌, వేములపల్లి రాజీవ్‌లకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో …

Read More »

కామారెడ్డి జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని, ఇందుకు ప్రజాప్రతినిదులు, అధికారులు అందరు కలిసి సమష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగాల పలితంగా, ఎన్నో పోరాటాల అనంతరం తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, నేడు మన రాష్ట్రంలో స్వేచ్చావాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు. తెలంగాణ …

Read More »

ఆల్‌ ఇండియా రేడియో

తిరువనంతపురంలోని ఆల్‌ ఇండియా రేడియో న్యూస్‌ ఎడిటర్‌/ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు ఫీజు: రూ.300(ఎస్సీ/ ఎస్టీ/ ఒబిసిలకు రూ.225) ఆఫ్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 26 చిరునామా: Station Director, Akash vani Bhavan, Trivandrum – 695014 వెబ్‌సైట్‌ : www.airtvm.com/careers

Read More »

ధరల పాపం తలాపిడికెడు

ఒకపక్క అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న ధరలు మరొకపక్క పొగమంచులా విస్తరిస్తు న్న కల్తీతో బీదాబిక్కితోపాటు సామాన్యులు విలవిలలాడి పోతున్నారు. గత రెండుమూడేళ్లగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సమృద్ధిగానే పడుతున్నాయి. ముఖ్యంగా గత ఖరీఫ్‌,రబీల్లో దిగుబడులు కూడా ఊహించని విధంగా పెరిగాయి. వరిధాన్యం ఉత్పత్తులే కాదు పప్పుదినుసుల తోపాటు మిర్చి లాంటి వాణిజ్య పంటలు కూడా బాగానే పండాయి. కానీ అవి సామాన్యు డికి అందుబాటులో లేకుండా కొండెక్కుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అదుపు లేకుండా పెరిగిపోతున్న ధరల ను నియంత్రించడంలో అధికారులు విఫలమవ్ఞతున్నా రని చెప్పకతప్పదు. …

Read More »