Breaking News

ధరల పాపం తలాపిడికెడు

Market

ఒకపక్క అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న ధరలు మరొకపక్క పొగమంచులా విస్తరిస్తు న్న కల్తీతో బీదాబిక్కితోపాటు సామాన్యులు విలవిలలాడి పోతున్నారు. గత రెండుమూడేళ్లగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సమృద్ధిగానే పడుతున్నాయి. ముఖ్యంగా గత ఖరీఫ్‌,రబీల్లో దిగుబడులు కూడా ఊహించని విధంగా పెరిగాయి. వరిధాన్యం ఉత్పత్తులే కాదు పప్పుదినుసుల తోపాటు మిర్చి లాంటి వాణిజ్య పంటలు కూడా బాగానే పండాయి. కానీ అవి సామాన్యు డికి అందుబాటులో లేకుండా కొండెక్కుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో అదుపు లేకుండా పెరిగిపోతున్న ధరల ను నియంత్రించడంలో అధికారులు విఫలమవ్ఞతున్నా రని చెప్పకతప్పదు. ధరలను అదుపు చేసేందుకు ఇంకొక పక్క ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్న కల్తీ సామ్రా జ్యానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారుల మీద అధికారు లను నియమిస్తున్నారు.నల్లబజారుకు నిత్యావసర వస్తు వ్ఞలు తరలించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరికల మీద హెచ్చరికలు జారీచేస్తున్నారు.

రోజుల తరబడి సమీ క్షలు చేస్తున్నారు. తెలంగాణలోకానీ, ఆంధ్రాలో కానీ సం బంధిత మంత్రులు,అధికారులు ప్రత్యేక శ్రద్ధతీసుకు న్నట్లు కన్పిస్తున్నారు. కానీ అవేమీ ఆచరణకు నోచుకోవ డంలేదు. దాడులు జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు తగ్గినట్టు కన్పించినా మళ్లీ రెండుమూడు రోజుల్లో యధా స్థితికి చేరుకుంటున్నాయి.ఎన్ని మంచి పథకాలు ప్రవేశ పెట్టి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించినా పెరుగుతు న్న ధరలతో ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతున్నదనే విషయం పాలకులకు ఆందోళన తెప్పిస్తున్నది.

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం కావడంతో ఎరువ్ఞలు సకా లంలో సరఫరా చేసేందుకు వ్యవసాయశాఖ గట్టి ప్రయ త్నమే చేస్తున్నది. క్రిమిసంహారక మందులు నాసిరకం నకిలీచోటు చేసుకోకుండా ఈసారి గట్టి చర్యలు తీసుకు న్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావ్ఞ ఇప్ప టికే ప్రకటించారు. నకిలీ విత్తనాల విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని, ఉక్కుపాదంతో అణచివేస్తామని హె చ్చరికలు జారీచేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిత్యా వసర వస్తువ్ఞల ధరలుపెరగడం పాలకులను ఉక్కిరిబిక్కి రి చేస్తున్నాయి. ఒకపక్క రైతుల ఉత్పత్తులకు ధరలు పాతాళానికి పడిపోతుంటే ఇంకొకపక్క వినియోగదారు లకు ధరలు చుక్కల్లో చేరుతున్నాయి.ఈ ధరలను తగ్గిం చేందుకు ముఖ్యంగా నల్లబజారు వ్యాపారాలకు కళ్లెం వేసేందుకు అధికారగణం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృ తం కావడం లేదు. ఒకపక్క ధాన్యం కొనేవారు లేక రైతులు రకరకాల ఇబ్బందులు పడుతుంటే ఈసారి కిలో బియ్యం నలభై రూపాయలకు పైగా చేరుకున్నది. ఇక మిర్చి గూర్చి ప్రత్యేకంగా చర్చించాల్సిన పనిలేదు. రైతు ల వద్ద ముప్ఫైనలభై రూపాయల కంటే ఎక్కువ ధరకు కొనేవారు లేకపోతే వినియోగదారునికి వంద నుంచి నూటయాభై రూపాయల వరకు ధర పలుకుతుంది.
ఇలా ఏ వస్తువు తీసుకున్నా ఉత్పత్తిదారునికి, వినియోగ దారునికి మధ్య పొంతన లేకుండా పోతున్నది. ఏ వస్తు వ్ఞ ధరలను తీసుకున్నా ఉత్పత్తిదారులు, వినియోగదారు ల మధ్య ఉన్న వ్యత్యాసం వందలాది కోట్ల రూపాయలు వరకు ఉంటుంది. ఇది ఏనాటి నుంచో జరుగుతున్నది. పాలకులు దళారీ వ్యవస్థను రూపుమాపుతామని హెచ్చ రించే కొద్దీ అది మరింత పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా పప్పుదినుసులు, ధాన్యం నిల్వలు పెద్దఎత్తున ఉన్నట్లు చెబుతున్నారు.

రైతుల వద్ద కొన్న ఉత్పత్తులను వారి వద్దనే ఉంచి రేట్లు పెరిగినా, పెంచుకున్న తర్వాత మార్కెట్లోకి తరలించే ఏర్పాట్లు ఏనాటి నుంచో కొనసాగుతున్నాయి. ఈసారి కొద్దిగా తగ్గినట్లు కన్పించినా ఇతర రాష్ట్రాల్లో నిల్వలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇక కల్తీ గూర్చి ఎంత తక్కువ చర్చిస్తే అంత మంచిదే మో. కల్తీ లేని వస్తువ్ఞ లేదు. ముఖ్యంగా నిత్యావసర వస్తువ్ఞల్లో కల్తీ పెరిగిపోవడంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. చివరకు చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు నిత్యంసేవించే పాలల్లో పెద్దఎత్తున కల్తీ జరుగుతున్నట్లు అధికారవర్గాలకు కూడా తెలియంది కాదు.ఎన్నోసార్లు బయటపడింది.

ఇటీవలకూడా పాలల్లో యూరియా లాంటివి కలిపి కృత్రిమ పాలను తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. కేసులు పెట్టి జైళ్లకు పంపారు. ఇలా ఎన్నోసార్లు కల్తీ సామ్రాట్లపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపినా తిరిగి వచ్చిన తర్వాత వారు అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. టీపొడిలో కల్తీ,కారంలో కల్తీ, పప్పులో కల్తీ, ఇలా కల్తీ లేని వస్తువే లేకుండాపోయింది.

అన్నిటికంటే ముఖ్యంగా నూనెలో కల్తీతో ప్రజలు రకరకాలవ్యాధుల బారిన పడుతున్నారు. పశువ్ఞల కొవ్ఞ్వతో తయారు చేసిన నూనె సరఫరాను ఇటీవలనే పట్టుకున్నారు.ఎంతోకాలంగా ఇది జరుగుతు న్నది.ఇప్పుడు పట్టుబడిన తర్వాత ఆగిపోతుందనే నమ్మ కాలు కూడా లేవ్ఞ. నల్లబజారుకు తరలించేవారిపై, కల్తీ సామ్రాట్లపైన ఇలా సామాన్యుల కడుపుకొడుతున్న వారి పై ఉక్కుపాదం మోపుతామని పాలకులు ఎన్నోసార్లు ప్రకటనలు, హెచ్చరికలుజారీచేశారు.

వాటిని ఈ నల్లబ జారుదారులు,దళారులు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడుకావల్సింది ప్రకటనలు, సమీక్షలు, సమావేశాలు కాదు. ఈ అక్రమాలను అడ్డుకునేందుకు సమర్థులైన, నీతివంతులైన అధికారులను నియమించి వాళ్లకు బంధం వేయకుండా వారి పనిని వారు చేసుకొనే అవకాశం కల్పిస్తే కొంత వరకైనా ఇవి తగ్గుముఖం పట్టవచ్చు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article