Daily Archives: June 3, 2017

క్రమశిక్షణతోనే ఉద్యోగికి మంచి గుర్తింపు

  గాంధారి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రమశిక్షణతోనే ఉద్యోగికి మంచి గుర్తింపు వస్తుందని కామారెడ్డి జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య అన్నారు. శనివారం గాంధారి మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో స్థానిక నయాబ్‌ తహసీల్దార్‌ అలెగ్జాండర్‌ తహసీల్దార్‌గా పదోన్నతి రావడంతో బదిలీపై వెళ్లగా, ఆయన వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. క్రమశిక్షణకు, నిజాయితీగా మారుపేరు డిటి అలెగ్జాండర్‌ అన్నారు. ఉద్యోగం సమయంలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా పనిచేశారని కితాబిచ్చారు. అదేవిధంగా రెవెన్యూ శాఖలో పనిచేయగా కత్తిమీద సాము లాంటిదని, …

Read More »

కెసిఆర్‌ కిట్‌ల పంపిణీ

  బీర్కూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం గర్భిణీలు, బాలింతలకు జడ్పిటిసి కిషన్‌ నాయక్‌, ఎంపిపి మల్లెల మీణ హన్మంతు కెసిఆర్‌ కిట్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రాథమిక వైద్యులు దిలీప్‌కుమార్‌, సర్పంచ్‌ నర్సయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Read More »

ట్రాక్టర్‌ ఢీకొని ఒకరి మృతి

  బీర్కూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నెమ్లి గ్రామంలో శనివారం ట్రాక్టర్‌ ఢీకొని ఒకరు మృతి చెందినట్టు నసురుల్లాబాద్‌ ఎస్‌ఐ గోపి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… నసురుల్లాబాద్‌ మండలం నెమ్లి గ్రామంలో మిషన్‌ కాకతీయ పనులకు బీహార్‌కు చెందిన ఉమేశ్‌కుమార్‌ (21) మోటారు సైకిల్‌పై రామకోటితో కలిసి బాన్సువాడకు వెలుతుండగా, బాన్సువాడ నుంచి వర్ని వైపు వెల్తున్న ట్రాక్టర్‌ డీకొనడంతో ఉమేశ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రామకోటికి గాయాలు కావడంతో అంబులెన్సులో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి …

Read More »

గర్భిణీలకు వరం కెసిఆర్‌ కిట్‌

  గాంధారి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలకు కెసిఆర్‌ కిట్‌ వరం లాంటిదని గాంధారి ఎంపిపి యశోదాబాయి అన్నారు. శనివారం గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కెసిఆర్‌ కిట్‌ పంపిణీ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి తానాజీరావుతో కలిసి ఆమె పాల్గొన్నారు. కెసిఆర్‌ కిట్‌ ద్వారా గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు నిర్వహించుకుంటే ప్రభుత్వం 12 వేల రూపాయలు నగదు రూపంలో ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా నగదును నాలుగు విడతలుగా గర్భిణీ స్త్రీ ఖాతాలో …

Read More »

ముదిరాజ్‌లకు ప్రత్యేక నిదులు కేటాయించాలి

  గాంధారి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముదిరాజ్‌ కులస్తుల అభివృద్ది కొరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా ముదిరాజ్‌ సంఘం నాయకులు విఠల్‌ ముదిరాజ్‌ అన్నారు. గాంధారి మండల కేంద్రంలోని పెద్దమ్మదేవి వారోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముదిరాజ్‌ల బోనాల పండగను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. హరితహారంలో ప్రతి మండలానికి 100 ఎకరాలు కేటాయించి మొక్కలను ముదిరాజ్‌లకు పంపిణీ చేయాలన్నారు. దీని ద్వారా మొక్కలను …

Read More »

చిన్నారి నృత్యకారిణి 5 వేల పారితోషికం

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక వేడుకల్లో చిన్నారి నృత్యకళాకారిణి రిబి తన అద్భుత నృత్యంతో ఆహుతులను అలరించింది. చిన్నారి నృత్య ప్రదర్శనను తిలకించిన ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ 5 వేల నగదు పారితోషికం అక్కడే అందజేశారు. రిబి నృత్యకారిణిగా జిల్లాకు మంచి పేరు తేవాలని, ఉన్నత స్తాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Read More »

సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేయాలి

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని తపస్‌ ప్రతినిదులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా శాఖపక్షాన సిపిఎస్‌ విధానాన్ని వ్యతిరేకిస్తు శనివారం 200 మంది ఉపాధ్యాయుల సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గం ఎదుర్కొంటున్న ఉద్యోగ భద్రతలేని సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. తమ వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు టేక్రియాల్‌లో శిక్షణ శిబిరం నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

వికలాంగత్వంపై ప్రజలకు అవగాహన

  గాంధారి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం తిప్పారం తాండాలో ప్రజలకు వికలాంగత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వీకార్‌ అకాడమి ఆఫ్‌రియాబిలిటేషన్‌ సైనెస్‌ సికింద్రాబాద్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఛాత్రోపాధ్యాయులు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిదులు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలో తాండా వాసులతో సమావేశం నిర్వహించారు. వికలాంగత్వం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. దీనికి సంబంధించిన ప్రతులను అందించారు. కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్‌ సరాదా, రిసోర్సు టీచర్లు పెంటయ్య, …

Read More »

ఆహారభద్రత చట్టం అమలు చేయాలి

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పంపిణీ పథకాన్ని, ఆహారభద్రత చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ హమాలీ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. వారు చేపడుతున్న రిలే దీక్షలు శనివారం నాటికి మూడోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు దశరథ్‌, కార్యదర్శి రాజులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారన్నారు. నిత్యవసర వస్తువులను ప్రజలకు రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ …

Read More »

కార్మికులు ఉపాధి అడుక్కునే పరిస్థితి దుర్మార్గం

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికులు ఓట్లు వేసి నాయకులను గెలిపించి ఉపాధిని అడుక్కోవడం దుర్గార్గచర్య అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాజలింగం అన్నారు. భవన నిర్మాణ కార్మికులు నిర్వహిస్తున్న నిరసన దీక్షలు శనివారం రెండోరోజుకు చేరుకున్నాయి. దీక్షను సందర్శించిన రాజలింగం మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ నిర్మాణ రంగ కార్మికుల జీవితాలను రోడ్డున పడవేసిందన్నారు. జిల్లాలో సొంత ఇల్లులేని కార్మికులకు కాలనీలు ఏర్పాటు చేయాలని, వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, 60 సంవత్సరాలు నిండిన …

Read More »