Daily Archives: June 5, 2017

సాదా బైనామాలను పూర్తిచేయాలి

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాదా బైనామాలను ఎప్పటికప్పుడు పరిశీలించి పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో సాదా బైనామాలపై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. సాదాబైనామాల్లో వివిధ రకాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత గలవారిని గుర్తించి ప్రక్రియను ఈనెల 9లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. సాదాబైనామా కేసులను వెంటనే పరిస్కరించాలని పేర్కొన్నారు. భూమికి సంబంధించి సమస్యలున్న పక్షంలో వాటిపై విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. …

Read More »

జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులివ్వాలి

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్కింగ్‌ జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారందరికి అక్రిడేషన్‌ కార్డులు అందజేయాలని టియుడబ్ల్యుజె (ఐజెయు) నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి విడతగా ఇప్పటివరకు కొంతమందికి మాత్రమే అక్రిడేషన్‌ కార్డులు ఇచ్చారని, మిగతా జర్నలిస్టులకు కార్డులు ఇవ్వలేదన్నారు. అర్హులైన వారందరికి అక్రిడేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు ఇవ్వాలని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో తమకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, కౌసర్‌ …

Read More »

పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణకు అందరు నడుంబిగించాలని ఆయా శాఖల అధికారులు పిలుపునిచ్చారు. కామారెడ్డిలో సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి సుభాష్‌, డిఎఫ్‌వో బాలమణి, న్యాయమూర్తి సలీంతో పాటు ఆయాశాఖల అధికారులు, న్యాయవాదులు మొక్కలకు నీరుపోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, తద్వారానే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోగలుగుతామన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం పథకంలో ప్రతి ఒక్కరుభాగస్వాములమై …

Read More »

తెరాస మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షునికి సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షునిగా ఎన్నికైన ముజీబుద్దీన్‌ను తెరాస నాయకులు ఘనంగా సన్మానించారు. పూలమాలలువేసి, మిఠాయిలు తినిపించారు. ఈ సందర్బంగా కేక్‌కట్‌చేసి పంచిపెట్టారు. కౌన్సిలర్‌గా రాజకీయ అరంగేట్రం చేసి ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌గా తెరాస పార్టీ మైనార్టీ సెల్‌ అధ్యక్షునిగా ఎన్నికవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

ప్రజావాణిలో 64 పిర్యాదులు

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 64 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు అందాయన్నారు. వాటిని ఆయా శాఖాధికారులకు సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ పంపారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, డిఆర్వో మణిమాల డిఆర్‌డిఓ పిడి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రకృతి పరిరక్షణకు అందరు నడుం బిగించాలి

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రకృతి పరిరక్షణ కోసం అందరు నడుం బిగించాలని నిర్దిష్ట పరిమితులు విధించుకొని నడుచుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో కన్వర్జెన్సీ సమావేశం జిల్లా అధికారులతో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2099 నాటికి భూతాపం 6 డిగ్రీల సెంటిగ్రేడ్‌ పెరిగితే మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతుందని, ప్రపంచ వ్యాప్తంగా అన్ని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయన్నారు. ఉపద్రవం నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటే భూతాపం నివారణకు చర్యలు …

Read More »

ఖతార్ లో చిక్కుకుని స్వగ్రామానికి చేరిన నిజామాబాద్ జిల్లా గన్నారం వాసి బాధితుడి వాట్సాప్ మెసేజ్ తో స్పందించిన నిజామాబాద్ ఎంపీ కవిత.

మృత్యుముఖం నుండి ఎట్టకేలకు తల్లిదండ్రులను, భార్యను చేరిన యెర్రా సాగర్. ఖతార్ లో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లా యువకుడు నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి సహాయంతో స్వగ్రామం చేరాడు. ఖతార్ లో ఉండగా బాధితుడు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గారికి వాట్సప్ లో చేసిన మెసేజ్ తో ఆ యువకుడి విముక్తికి మార్గం సుగమమైంది. చంపుతానని బెదిరించిన కఫిల్ బారి నుండి ఇపుడు స్వగ్రామం చేరాడు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన …

Read More »