Daily Archives: June 7, 2017

తహసీల్దార్లు పద్దతి మార్చుకోవాలి

  కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంతులవారి గ్రామ రెవెన్యూ సహాయకుల పట్ల తహసీల్దార్లు, విఆర్వోలు తమ పద్దతి మార్చుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రాజలింగం అన్నారు. సిఐటియు మండల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2015లో ఎమ్మెల్యే గంప గోవర్దన్‌, ఆర్డీవో నగేశ్‌రెడ్డిలు వంతులవారి రెవెన్యూ సహాయకులకు ఎవరి వంతు పని వారు చేసుకోవాలని చెప్పారన్నారు. ప్రస్తుతం తహసీల్దార్లు, విఆర్వోలు వంతులవారి విఆర్‌ఏలను ఇబ్బందులకు గురిచేస్తు భయపెట్టిస్తున్నారని, దాన్ని మానుకోవాలని డిమాండ్‌ …

Read More »

ముజీబుద్దీన్‌కు సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షునిగా ఎన్నికైన ముజీబుద్దీన్‌ను మునిసిపల్‌ కార్మికులు బుధవారం ఘనంగా సన్మానించారు. వాటర్‌ వర్క్స్‌ విభాగంలో మునిసిపల్‌ కార్మిక అధ్యక్షుడు అయాజ్‌ బేగ్‌ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మునిసిపల్‌ కార్మికుని కూతురు భార్గవి 10వ తరగతిలో 10/10 మార్కులు సాధించినందుకు ముజీబుద్దీన్‌ విద్యార్తిని సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు పిప్పిరి వెంకటి, చంద్రశేఖర్‌రెడ్డి, భూమేశ్‌ యాదవ్‌, కార్మికులు శ్రీనివాస్‌, శ్రీదర్‌, సంజీవ్‌కుమార్‌, నర్సింగ్‌, లక్ష్మణ్‌, కిషన్‌, రవిందర్‌, …

Read More »

ఈత వనాలను పెంపొందించాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే రోజుల్లో జరపబోయే హరితహారంలో ఈతవనాల మొక్కలను విరివిగా నాటి వాటిని పెంపొందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కలెక్టరేట్‌ చాంబరులో బుధవారం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 31 నర్సరీల్లో పెంచుతున్న 6 లక్షల 31 వేల ఈతవనం మొక్కలను ఉపయోగానికి వచ్చే వాటిని ఎంపిక చేసుకోవాలని తెలిపారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త …

Read More »

సాయినాథుని ఆలయంలో మంత్రి పూజలు

  కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం విద్యానగర్‌ కాలనీలోని సాయి ఆలయంలో బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సాయి ఆలయాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రికి స్వాగతం పలికి అర్చకులు తీర్థ, ప్రసాదాలు జ్ఞాపిక అందజేశారు.

Read More »

ఆసుపత్రిలో దుప్పట్ల పంపిణీ

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ కామరెడ్డి వివేకానంద ఆద్వర్యంలో బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. లయన్స్‌ క్లబ్‌ వందేళ్ళు పూర్తిచేసుకున్న నేపథ్యంలో రోగులకు దుప్పట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు లక్ష్యంగా క్లబ్‌ పనిచేస్తుందని, సేవలను ఇలాగే కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, ప్రతినిదులు కైలాష్‌ సంతోష్‌, సతీష్‌గౌడ్‌, హర్షిత్‌గౌడ్‌, అశోక్‌, వేణు, శ్రీధర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

దేశంలోనే ఆర్థికంగా ఎదుగుతున్న రాష్ట్రం తెలంగాణ

  కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే ఆర్థికంగా ఎదుగుతున్న రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో 14వ ఆర్తిక సంఘం నిధులు రూ. 62 లక్షలతో నిర్మించిన బిటి రోడ్లను ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఓప్రయివేటు ఆసుపత్రిని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్‌లో నిర్వహించిన పట్టణ తెరాస కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదలకు డబ్బు ఖర్చు లేకుండా …

Read More »

నందిపేటలో గురువారం ఇఫ్తార్‌ విందు

  నందిపేట, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట జామెమసీద్‌ పక్కనగల టెలిఫోన్‌ బీడీ కంపెనీలో కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఇప్తార్‌విందు నిర్వహిస్తున్నట్టు పార్టీ మండల అధ్యక్షుడు, మైనార్టీ నాయకులు జమీల్‌ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి విచ్చేస్తున్నట్టు తెలిపారు.

Read More »

ఒకే వర్షానికి రోడ్డు బురదమయం

  నందిపేట, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దగల ప్రధాన రహదారి గుంతలమయంగా ఉండడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి చిత్తడిగా మారింది. మోకాలు లోతువరకు నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకే వర్షానికి ఈ విదంగా మారితే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలను పూడ్చివేయించాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కూడా తాత్కాలికంగా గుంతలు పూడ్చడంతో ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని, …

Read More »

ప్రారంభానికి ముందే బీటలు…

  నందిపేట, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మండల సముదాయం వద్ద నిర్మించిన స్త్రీశక్తి భవనం ప్రారంభానికి నోచుకోకముందే బీటలు వారుతోంది. ఇందిరా క్రాంతి పథకం, ఉపాధి హామీ కార్యాలయాలకు కలిపి గత ప్రభుత్వం స్త్రీశక్తి భవనం పేరుతో నాలుగేళ్ల క్రితం భవనం మంజూరు చేసింది. ఇందుకుగాను మొదటవిడతలో రూ. 25 లక్షలు, రెండో విడత అదనంగా రూ. 5 లక్షలు మొత్తం రూ. 30 లక్షలతో నిర్మించేందుకు పనులు చేపట్టారు. గుత్తేదారు మొదట పనులు ఆర్భాటంగా …

Read More »