Breaking News

ముజీబుద్దీన్‌కు సన్మానం

 

కామారెడ్డి, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షునిగా ఎన్నికైన ముజీబుద్దీన్‌ను మునిసిపల్‌ కార్మికులు బుధవారం ఘనంగా సన్మానించారు. వాటర్‌ వర్క్స్‌ విభాగంలో మునిసిపల్‌ కార్మిక అధ్యక్షుడు అయాజ్‌ బేగ్‌ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మునిసిపల్‌ కార్మికుని కూతురు భార్గవి 10వ తరగతిలో 10/10 మార్కులు సాధించినందుకు ముజీబుద్దీన్‌ విద్యార్తిని సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు పిప్పిరి వెంకటి, చంద్రశేఖర్‌రెడ్డి, భూమేశ్‌ యాదవ్‌, కార్మికులు శ్రీనివాస్‌, శ్రీదర్‌, సంజీవ్‌కుమార్‌, నర్సింగ్‌, లక్ష్మణ్‌, కిషన్‌, రవిందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *