Breaking News

ఒకే వర్షానికి రోడ్డు బురదమయం

 

నందిపేట, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దగల ప్రధాన రహదారి గుంతలమయంగా ఉండడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి చిత్తడిగా మారింది. మోకాలు లోతువరకు నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకే వర్షానికి ఈ విదంగా మారితే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలను పూడ్చివేయించాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కూడా తాత్కాలికంగా గుంతలు పూడ్చడంతో ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని, కాబట్టి పూర్తిస్థాయి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *