Breaking News

తహసీల్దార్లు పద్దతి మార్చుకోవాలి

 

కామారెడ్డి, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంతులవారి గ్రామ రెవెన్యూ సహాయకుల పట్ల తహసీల్దార్లు, విఆర్వోలు తమ పద్దతి మార్చుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రాజలింగం అన్నారు. సిఐటియు మండల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2015లో ఎమ్మెల్యే గంప గోవర్దన్‌, ఆర్డీవో నగేశ్‌రెడ్డిలు వంతులవారి రెవెన్యూ సహాయకులకు ఎవరి వంతు పని వారు చేసుకోవాలని చెప్పారన్నారు. ప్రస్తుతం తహసీల్దార్లు, విఆర్వోలు వంతులవారి విఆర్‌ఏలను ఇబ్బందులకు గురిచేస్తు భయపెట్టిస్తున్నారని, దాన్ని మానుకోవాలని డిమాండ్‌ చేశారు. గత ఆర్డీవో అనుసరించిన విధానాన్ని ప్రస్తుత తహసీల్దార్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజయ్య, రాజు, నర్సింలు, లక్ష్మణ్‌, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *