Breaking News

దేశంలోనే ఆర్థికంగా ఎదుగుతున్న రాష్ట్రం తెలంగాణ

 

కామారెడ్డి, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే ఆర్థికంగా ఎదుగుతున్న రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో 14వ ఆర్తిక సంఘం నిధులు రూ. 62 లక్షలతో నిర్మించిన బిటి రోడ్లను ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఓప్రయివేటు ఆసుపత్రిని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్‌లో నిర్వహించిన పట్టణ తెరాస కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదలకు డబ్బు ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించి వారిని రక్షించే బాధ్యత తెరాస ప్రభుత్వానిదేనన్నారు.

పేదల కష్టాలను తెలుసుకొని వారికి ప్రభుత్వం భరోసాగా నిలబడుతుందని, పేదల కోసం, మహిళల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. తెరాసను హేళన చేస్తున్న వారికి డబ్బు సంపాదించడం, కబ్జాలు చేయడం, దోచుకోవడం, దాచుకోవడమే తెలుసునని ఘాటుగా విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో పార్టీకి గట్టిపునాదినిచ్చింది నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలేనని ప్రశంసించారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవలం 6 గంటల విద్యుత్తును రెండు దఫాలుగా ఇవ్వడంతో ఎంతో మంది రైతులు మృతి చెందారన్నారు. రైతన్నకు కష్టం రాకూడదనే ఉద్దేశంతో తెరాస ప్రభుత్వం రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్తును అందిస్తుందన్నారు. త్వరలో 24 గంటలకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, పార్టీ నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌, రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ముజీబుద్దీన్‌, నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, రాజేశ్వర్‌రావు, లక్ష్మినారాయణ, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *