Breaking News

ప్రారంభానికి ముందే బీటలు…

 

నందిపేట, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మండల సముదాయం వద్ద నిర్మించిన స్త్రీశక్తి భవనం ప్రారంభానికి నోచుకోకముందే బీటలు వారుతోంది. ఇందిరా క్రాంతి పథకం, ఉపాధి హామీ కార్యాలయాలకు కలిపి గత ప్రభుత్వం స్త్రీశక్తి భవనం పేరుతో నాలుగేళ్ల క్రితం భవనం మంజూరు చేసింది. ఇందుకుగాను మొదటవిడతలో రూ. 25 లక్షలు, రెండో విడత అదనంగా రూ. 5 లక్షలు మొత్తం రూ. 30 లక్షలతో నిర్మించేందుకు పనులు చేపట్టారు. గుత్తేదారు మొదట పనులు ఆర్భాటంగా ప్రారంభించి రెండంతస్తుల భవనానికి నత్తనడకన పనులు కొనసాగించాడు. హడావిడి చేసి పనులు పూర్తిచేసినప్పటికి ఇంతవరకు విద్యుత్‌ సరఫరా ఇవ్వలేదు. ఇంతవరకు ప్రారంభానికి నోచుకోవడం లేదు. అదేవిధంగా భవనం వెనకభాగంలో మొదటి అంతస్తు స్లాబ్‌ వంగి ఉండడంతో పై అంతస్తు గోడలకు బీటలు వారాయి. గమనించిన గుత్తేదారు కిందినుంచి పిల్లరువలె నిర్మించి వదిలేశాడు. నాసిరకం పనులు చేపట్టిన గుత్తేదారుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *