Daily Archives: June 8, 2017

విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయం

  కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్రాంత ఉద్యోగులు ఉత్సాహంతో ఉరకలేస్తు, సమాజానికి సేవలందిస్తున్నారని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత అన్నారు. గురువారం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ చేత అందజేయబడిన ఇండోర్‌ గేమ్స్‌ పరికరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. వృద్దుల సంక్షేమం కొరకు 2007 చట్టంపై విస్తృత ప్రచారం చేసి వాటి పరిష్కారంలో చొరవ తీసుకొని, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో వృద్దుల సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి వృద్దుల ఇంటివద్దనే …

Read More »

ఇఫ్తార్‌ మతసామరస్యానికి ప్రతీక

  నందిపేట, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ మాసం పురస్కరించుకొని మండల కేంద్రంలోని జామె మసీద్‌పక్కనగల టెలిఫోన్‌ బీడీ కంపెనీలో కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభాపతి కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్‌విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, పవిత్ర రంజాన్‌ మాసంలో నియమనిష్టలతో ఉపవాసం ఉంటూ ప్రార్థన చేయడంతో ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య రహస్యాలు ఉన్నాయన్నారు. ఇఫ్తార్‌ విందు వలన మతసామరస్యం పెంపొందుతుందన్నారు. గతంలో కాంగ్రెస్‌ …

Read More »

నేడు గాంధారికి ఎమ్మెల్యే రాక

  గాంధారి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలానికి శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి రానున్నట్టు తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ముకుంద్‌రావు తెలిపారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారని తెలిపారు. అదేవిధంగా గాంధారి హైస్కూల్‌లో నిర్మించిన నూతన తరగతుల బవన సముదాయాన్ని కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. అనంతరం దుర్గం గ్రామ పంచాయతీలోని గుజ్జుల్‌ గ్రామంలో దుర్గం సర్పంచ్‌ నరేందర్‌ తెరాస పార్టీలో చేరే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొననున్నారు. సర్పంచ్‌తో …

Read More »

సబ్సిడీపై సోయా విత్తనాల పంపినీ

  గాంధారి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయంలో సబ్సిడీ సోయా విత్తనాలను గురువారం పంపినీ చేశారు. ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమైనందున తెలంగాణ ప్రభుత్వం రైతులకు 33 శాతం సబ్సిడీపై సోయా విత్తనాలను అందజేస్తుంది. ఒక్క బస్తా 30 కిలోలు ఉంటుందని,రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్‌విండో ఛైర్మన్‌ ముకుంద్‌రావు తెలిపారు. మండలంలో గ్రామాల వారిగా పర్మిట్లు అందజేసే కౌంటర్లు ఏర్పాటు చేశామని, రైతులు ఆయా కౌంటర్లతో పర్మిట్లు పొందాలని ఏవో యాదగిరి అన్నారు. …

Read More »

వృద్ధ కళాకారులు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలి

  కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్‌ కళాకారులకు అండగా నిల్వడానికి ఎవరైతే 58 సంవత్సరాలు నిండిన వృద్ధ కళాకారులు జిల్లాలో నివసిస్తున్నారో వారికి పింఛన్‌ కొరకు దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుతో పాటు 2 పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోలు, ఆదాయ దృవీకరణ పత్రం, కుల దృవీకరణ పత్రం, వయసు దృవీకరణపత్రం, ఆధార్‌కార్డు, కళా రూపాలలో ప్రదర్శనలు ఋజువుగా కళాకారుడు పొందిన ప్రశంసాపత్రాలు, ఫోటోలు, …

Read More »

నివాస ప్రాంతాలకు దూరంగా చెత్తను తరలించాలి

  కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెత్తను అన్నిచోట్ల పారవేయకుండా బుట్టలలో వేసి మునిసిపల్‌ సిబ్బంది వచ్చినపుడు వాటిని ట్రాక్టర్లలో, తోపుడు బండ్లలో వేయాలని, నివాస ప్రాంతాలకు దూరంగా డంప్‌ యార్డుకు చేరవేయడానికి వీలవుతుందని కామారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య అన్నారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని 4వ వార్డులో స్వచ్చభారత్‌ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రం చేశారు. వార్డు సభ్యులకు ఉచితంగా చెత్తబుట్టలను పంపిణీ చేశారు. రాబోయే వర్షాకాలంలో చెత్తవల్ల మురికినీరు నివాస ప్రాంతాల్లో చేరి …

Read More »

పనులు వేగవంతం చేయండి

  నిజాంసాగర్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని సమీపంలో ఉన్న పెద్దపూల్‌ వంతెన వద్ద జరుగుతున్నమిషన్‌ భగీరథ పనులను మిషన్‌ భగీరథ ఇఇ చౌదరిబాబు డిఇ వెంకట్‌రెడ్డిలు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఆయన పర్యవేక్షించారు. నాణ్యతతో పనులుచేపట్టాలని పైపులైన్ల ఏర్పాటులో పారదర్శకాలను అనుసరించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం పనులు జరగకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేపట్టాలన్నారు. ఆయన వెంట ఏఇఇ రాజశేఖర్‌రెడ్డి, శివకుమార్‌, మేనేజర్‌ శాంతికుమార్‌, ఏఎం జ్ఞానప్రసాద్‌, …

Read More »

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

  నందిపేట, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం జిజి నడ్కుడ గ్రామానికి చెందిన కొత్తూరు చిన్న చిన్నయ్య (60) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం… చిన్న చిన్నయ్య గురువారం ఉదయం రోజులాగానే పొలానికి వెళ్ళి ఫెన్సింగ్‌ వైరు దాటుతుండగా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. పక్కనే విద్యుత్‌ డబ్బలోని కరెంటు తీగలు గాలివానకు ఊడిపోయి పడిపోవడంతో అవి ఫెన్సింగ్‌ వైరుకు తగలడంతో విద్యుత్‌ సరఫరా అవుతుంది. చిన్నయ్య గమనించక అలాగే దాటుతుండగా ప్రమాదవశాత్తు మృతి …

Read More »

సాగుకు రైతుల ఏర్పాట్లు

నందిపేట, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి కాలం ముగిసి ఖరీఫ్‌ సీజన్‌పంటల సాగుకు తెరలేసింది. తొలకరి కురియడంతో రైతులు పంట సాగుకు సిద్దమయ్యారు. రైతులు పంట పొలాల్లో దుక్కులు దున్ని భూమి సిద్దం చేయడంతోపాటు నల్లమట్టి వేయడంలో బిజీబిజీగా ఉన్నారు. గత సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురియడంతో చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉంది. అదేవిధంగా గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటి సరఫరాతో పంటలు భారీస్తాయిలో పండాయి. ఇపుడు కూడా రైతులు పంటపొలాల్లో సారవంతమైన భూమి కోసం నల్లమట్టిని, …

Read More »