Breaking News

Daily Archives: June 9, 2017

ఇంటర్‌ ఫలితాల్లో ఆర్యభట్ట విద్యార్థుల ప్రతిభ

  కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ప్రకటించిన ఇంటర్‌ పలితాల్లో కామారెడ్డి ఆర్యభట్ట జూనియర్‌ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్తాయి ర్యాంకులు సాధించారు. ఎంపిసిలో అనూష రాష్ట్రస్తాయిలో మూడవ ర్యాంకు, గౌతమి 4వ ర్యాంకు, రవళి 5వ ర్యాంకు, శశికుమార్‌ 7వ ర్యాంకులు సాధించారు. బైపిసిలో అఖిల 4వ ర్యాంకు సాధించారు. వీరితోపాటు పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం పట్ల ప్రిన్సిపాల్‌ ఏ. హన్మంత్‌రావు ఆనందం వ్యక్తంచేశారు. ర్యాంకులు పొందిన విద్యార్థులను సన్మానించారు. బాణా సంచా …

Read More »

ఘనంగా కల్కీ భగవానుల కల్యాణం

  కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కల్కి భగవాన్‌ ఆలయంలో కల్కి భగవానుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని బజనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు.

Read More »

వైభవంగా కుంకుమ పూజలు

  కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం మహిళలు కుంకుమపూజలు భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆద్వర్యంలో కన్యకాపరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికిపూజలుచేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు అనిల్‌కుమార్‌, రాజు, రమేశ్‌, సుదర్శన్‌, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Read More »

విఆర్‌ఏలను విధుల్లోకి తీసుకోవాలి

  కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంతుల వారి గ్రామ రెవెన్యూ సహాయకులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తు సిఐటియు ఆద్వర్యంలో శుక్రవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో శ్రీనుకు వినతి పత్రం సమర్పించారు. డివిజన్‌లోని విఆర్‌ఏలందరు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గతంలో చేసిన ఆర్డీవో సూచనలు పాటించి రికార్డులను కొనసాగిస్తు ఎవరి వంతు పని వారు చేయడానికి తహసీల్దార్లు విఆర్‌ఏలకు ఆదేశాలివ్వాలని కోరారు. ఆర్డీవో …

Read More »

పేదలకు బియ్యం, దుస్తుల పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి వాసవీ క్లబ్‌ ఆద్వర్యంలో శుక్రవారం నిరుపేదలకు చీరెలు, లుంగీలు, టవల్‌లు, బియ్యం పంపిణీ చేశారు. డిప్యూటి గవర్నర్‌ గుడ్‌విల్‌ విజిట్‌ కార్యక్రమాన్ని పురస్కరించుకొని హౌజింగ్‌ బోర్డు వినాయక ఆలయం వద్ద క్లబ్‌ అధ్యక్షుడు ఆకుల నారాయణ, డిప్యూటి గవర్నర్‌ ఉప్పల సమత ఆధ్వర్యంలో పేదలకు వాటిని వితరణ చేశారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్‌ ప్రతినిదులు మాధవి, మంజుల, పద్మ, వాసవీ క్లబ్‌ ప్రతినిదులు శ్రీనివాస్‌, సూర్యనారాయణ, ఉమ, శ్రీనివాస్‌, మంచు …

Read More »

పెన్షనర్ల సమస్యలు పరిస్కరించాలి

  కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పెన్సనర్ల సమస్యలు వెంటనే పరిస్కరించాలని కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిదులు శుక్రవారం ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లందరికి అదనపు పెన్షన్‌ వర్తింపజేయాలని, ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని, ఇఎస్‌ఎస్‌ అమలు చేయాలని, రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని తదితర డిమాండ్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, ప్రధాన …

Read More »

తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం

  – ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి గాంధారి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధారి మండలం దుర్గం సర్పంచ్‌ నరేందర్‌ నాయక్‌ తెరాస పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి సమక్షంలో దుర్గం గ్రామ పంచాయతీ సర్పంఛ్‌ నరేందర్‌తో పాటు పాలకవర్గ సభ్యులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా గుజ్జుల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. దుర్గ గ్రామ పంచాయతీ చాలా …

Read More »

ఇంటింటికి మోడి పథకాల ప్రచారం

  గాంధారి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటికి మోడి పథకాలను బిజెపి నాయకులు ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం గాంధారి మండలంలోని కరక్‌వాడి, బూర్గుల్‌, తిప్పారం గ్రామాల్లోని బూత్‌ స్థాయిల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి చేస్తున్న అభివృద్ధి ప్రవేశపెట్టిన పథకాలను గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బూత్‌ స్థాయిలో ప్రజలతో కలిసి పథకాలను వివరిస్తున్నారు. దేశం మోడి నాయకత్వంలో అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు. కేంద్ర నిదులతోనే తెలంగాణ అభివృద్ది చెందుతుందని, మోడి నాయకత్వంలో 2019లో …

Read More »

నూతన భవనాలు పరిశీలించిన ఎమ్మెల్యే

  గాంధారి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండల కేంద్రంలో శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మొదటగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, భవనాన్ని రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం నూతన భవనంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యేను స్థానిక సర్పంచ్‌ సత్యం, ఉపసర్పంచ్‌ ఆకుల శ్రీధర్‌, పంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించారు. …

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

  గాంధారి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు శుక్రవారం సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అందజేశారు. గ్రామానికి చెందిన బెజుగాం ప్రసాద్‌ భార్య ధనలక్ష్మి గత ఆరునెలల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంది. బాధిత మహిళ సిఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా ఆమెకు 50 వేల రూపాయల మంజూరు అయ్యాయి. దీంతో మంజూరైన చెక్కును స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి, జడ్పిటిసి …

Read More »