నూతన భవనాలు పరిశీలించిన ఎమ్మెల్యే

 

గాంధారి, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండల కేంద్రంలో శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మొదటగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, భవనాన్ని రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం నూతన భవనంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యేను స్థానిక సర్పంచ్‌ సత్యం, ఉపసర్పంచ్‌ ఆకుల శ్రీధర్‌, పంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత హైస్కూల్‌లో నిర్మించిన నూతన అదనపు గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పిటిసి తానాజీరావు, సింగిల్‌ విండో ఛైర్మన్‌లు ముకుంద్‌రావు, శ్రీనివాస్‌, ఎంపిపి శివాజీరావు, ఎఎంసి ఛైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, తెరాస నాయకులు సర్వపూర్‌ సత్యం పటేల్‌, ఎంపిటిసి అంజద్‌ఖాన్‌, తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *