Breaking News

పెన్షనర్ల సమస్యలు పరిస్కరించాలి

 

కామారెడ్డి, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పెన్సనర్ల సమస్యలు వెంటనే పరిస్కరించాలని కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిదులు శుక్రవారం ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లందరికి అదనపు పెన్షన్‌ వర్తింపజేయాలని, ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని, ఇఎస్‌ఎస్‌ అమలు చేయాలని, రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని తదితర డిమాండ్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్ళులు ప్రతాప్‌రెడ్డి, వెంకటి, గౌరవ అధ్యక్షుడు భద్రయ్య, ప్రతినిదులు సాయాగౌడ్‌,యాదగిరి, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, కుతుబుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *