Breaking News

తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం

 

– ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి

గాంధారి, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధారి మండలం దుర్గం సర్పంచ్‌ నరేందర్‌ నాయక్‌ తెరాస పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి సమక్షంలో దుర్గం గ్రామ పంచాయతీ సర్పంఛ్‌ నరేందర్‌తో పాటు పాలకవర్గ సభ్యులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా గుజ్జుల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. దుర్గ గ్రామ పంచాయతీ చాలా పెద్దదని, దీన్ని రెండు లేదా మూడు జిపిలుగా మారుస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి పంపించాలని తెలిపారు.

అంచెలంచెలుగా దుర్గం గ్రామపంచాయతీని అభివృద్ది చేసుకుందామన్నారు. ఇప్పటికే నూతన జిపి భవనానికి నిదులు మంజూరు చేశామని, త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. గుజ్జుల్‌ డ్యాం సామర్థ్యం పెంచడం వల్ల భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి రెండు పడకల గదులు మంజూరు చేస్తామన్నారు. మిషన్‌ భగీరథద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. సుమారు 500 మంది ఎమ్మెల్యే సమక్షంలో తెరాసలో చేరారు. కార్యక్రమంలో జడ్పిటిసి తానాజీరావు, తెరాస నాయకులు ముకుంద్‌రావు, శివాజీరావు, శ్రీనివాస్‌, సత్యం పటేల్‌, శ్రీకాంత్‌రెడ్డి, సత్యం, అంజద్‌ఖాన్‌, రాంకిషన్‌రావు, మోతిలాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *