Daily Archives: June 10, 2017

ఫుడ్‌ కమిటీ ఛైర్మన్‌కు సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమీషన్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన న్యాయవాది కొమ్ముల తిరుమల్‌రెడ్డిని కామారెడ్డిలో శనివారం ఘనంగా సన్మానించారు. పార్టీ శ్రేణులు ఆయా సంఘాల నాయకులు తిరుమల్‌రెడ్డి దంపతులకు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. తెలంగాణ పోరాటంలో ఆదినుంచి చురుకుగా పాల్గొని తెలంగాణ సాధనలో తిరుమల్‌రెడ్డి తనదైన పాత్ర పోసించారన్నారు. నిఖార్సైన ఉద్యమకారునికి ప్రభుత్వం పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read More »

ఆరెస్సెస్‌ దాడులు ప్రజాస్వామ్య విరుద్దం

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం పార్టీ నాయకత్వంపై ఆరెస్సెస్‌ దాడులు ప్రజాస్వామ్య విరుద్దమని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డిలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విరుద్దమైన ఆటవిక దాడులను పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశంలో ప్రజల స్వేచ్చ హరించే చర్యలను సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తే దాన్ని జీర్ణించుకోలేక ఆరెస్సెస్‌ భౌతిక దాడులకు దిగుతుందని ఆరోపించారు. దీన్ని తిప్పికొట్టేందుకు సిపిఎం పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్య శక్తులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు …

Read More »

చెత్తబుట్టలు పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 28వ వార్డు ఎన్జీవోస్‌ కాలనీ ఆర్‌.కె.లాడ్జ్‌ పరిధిలో శనివారం కౌన్సిలర్‌ అరికెల ప్రభాకర్‌ యాదవ్‌ ఆద్వర్యంలో ఇంటింటికి చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జిల్లా బిసి అధికారి దేవిదాస్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పాల్గొని 50 మందికి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్తను బుట్టలో వేసి మునిసిపల్‌ చెత్త రిక్షా వచ్చినపుడు అందులో వేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని …

Read More »

విశ్వబ్రాహ్మణ సంఘంలో సభ్యత్వం పొందాలి

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులుగా చేరాలని కామారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అడ్‌హక్‌ కమిటీ ప్రతినిధులు కోరారు. శనివారం వారు సమావేశమై మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండల, గ్రామ విశ్వబ్రాహ్మణ సభ్యులందరు ఒకే సంఘం కింద సభ్యత్వం చేసుకొని అందరు సంఘటితం కావాలన్నారు. అప్పుడే ప్రభుత్వం ప్రకటించిన పథకాలను పొంది అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిదులు బ్రహ్మం, ముకుందం, శ్రీనివాస్‌, చంద్రమౌళి, …

Read More »

వైభవంగా లక్ష్మి గణపతి మహాయాగం

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై నిర్మించిన కృష్ణమందిరం, బ్రహ్మజ్ఞాన ఆశ్రమంలో శనివారం లక్ష్మిగణపతి మహాయాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు ఆలయంలో మహాయాగం తోపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం గణపతిపూజ, స్వస్తివాచనం, దీక్షా గ్రహణం, అఖండ దీపారాధన, ప్రధాన మండప ఆవాహన, అర్చన, కలశ, స్థంభ, ద్వార,తోరణ స్థాపన, మహాధ్వజ స్తాపనతోపాటు …

Read More »

అధ్వాన్నంగా రహదారులు

  నిజాంసాగర్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చరిత్రలో లేనివిధంగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మంజూరు చేయని రీతిలో రోడ్లు అభివృద్దికి నిధులు ఇస్తున్నాం, రహదారులను బాగు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. మే నెలాఖరులోగా రహదారిపై ఎక్కడ కూడా గుంతలు కనబడకుండా తీర్చిదిద్దాలని చెప్పారు. జూన్‌ 1వ తేదీ నాటికి రహదారిపై గుంత కనిపిస్తే అధికారులపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. జూన్‌ 10వ తేదీ వచ్చినా రోడ్డు మరమ్మతులు ఎక్కడా చేపట్టలేదు. ఇక గుంతలను పూడ్చడానికి …

Read More »

ఖాళీల భర్తీకి దరఖాస్తులు

  నిజాంసాగర్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ జవహార్‌ నవోదయ విద్యాలయంతోపాటు ఇతర ప్రాంతాల్లోని నవోదయ పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌లో 11వ తరగతిలో గల ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు నిజాంసాగర్‌ నవోదయ ప్రిన్సిపాల్‌ శేఖర్‌బాబు తెలిపారు. ఎంపిసి, బైపిసి, కామర్స్‌, హ్యూమనిటిస్‌, ఒకేషనల్‌ కోర్సుల్లో పరిమిత ఖాళీలు భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్టు తెలిపారు. 2016-17 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై …

Read More »